రాజమహేంద్రవరం, నవంబర్ 11 :
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిర్వహించిన యూనిటి మార్చ్ – ఎక్ భారత్ – ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కనాగేద్ర పాల్గొన్నారు.
సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలను స్మరించుకుంటూ, దేశంలో ఐక్యత—సమగ్రత —దేశభక్తి భావాలను మరింత బలపరచాలనే నినాదంతో స్థానిక ఆనం కళాకేంద్రం నుండి వై జంక్షన్ వి.టి కాలేజ్ వరకూ యూనిటి మార్చ్ పాదయాత్ర (ర్యాలీ ) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణ , కురగంటి సతీష్, రవిశంకర్, తగరం సురేష్, అడప వరప్రసాద్ ,పై బోయిన సురేంద్ర, కాలేపు సాయిరాం బురా రామచంద్రరావు మాట్ల ఆంజనేయులు , శ్రీను, ఎన్.సి.సి కేడెట్లు మరియు కార్యక్రమ నిర్వాహకులు మై భారత్ బృందం సభ్యులు , విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.


