Thursday, 5 February 2026
  • Home  
  • యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద
- Featured - ఆంధ్రప్రదేశ్ - సాహితీ

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

‘‘‌లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ ‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పున్నమి ప్రత్యేక కథనం ‘‘ఇనుప నరాలు,ఉక్కు కండ రాలున్న వంద మంది యువకు లను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ పక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవా్య ప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందే హంగా స్వామి వివేకానందు డిదే. ఆధు నిక భారతదేశం ప్రపంచం లోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. ప్రజ్ఞలో, మేధా సంపత్తిలో భారతీ యులు మరెవరికి తక్కువ కాదని నిరూపించడం ద్వారా,ముఖ్యంగా భార తీయ యువతరంలో చైతన్యంనిం పడా నికి, ఆత్మ విశ్వాసం కలిగించ డానికి ఆయన తన జీవితమంతా కృషి చేశారు. ఆలోచన పటిమ, నిర్ణయ సామర్ధ్యం, వెనుదిరగని ఆచరణ, ధైర్యంతో ఫలితా లను స్వీకరించగలిగే ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్ఠించడానికి వివేకా నంద ఎంత గానో ప్రయత్నించారు. భావి భారతీయ తరాలకు ఎన్నటికీ తరగని కార్యదక్షత, స్ఫూర్తిని అందజేయడం కోసం ఆయన అలుపెర గని పరిశ్రమ చేశారు. ఏ ‌దేశంలోనైనా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరంలేదని, యువ జనులంతా మనస్ఫూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యమౌతుందని వివేకానందుని భావన. ప్రపంచ దేశాలను తిరిగిన ఆయన వివిధ దేశాలలోని యువతరానికి భారతీ య యువ తరానికి ఆలోచన విధానం లోను, మనస్తత్వంలోను ఉన్న భేదాలను ప్రస్ఫుటంగాగమనించారు.భారతదేశం ఎదుర్కొంటు న్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమ స్యల కంటే అతి పెద్ద సమస్య ఇక్కడి యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవ డమేనని వివేకానంద భావించారు. ఆయన తన ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరా న్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. ఓటమిని జీర్ణిం చుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరా శకు గురై కృంగిపో యే భారతీయ యువతరాన్ని వివేకా నంద తన బోధ నలతో చైతన్యపర్చారు. పరాజయాల నుండి గుణపాఠాలు నేర్చు కోవాలని, ఓటమి అనేది అపకారి కాదని, అవి జీవితానికి మెరుగులు దిద్దుతుందని ఆయన భావన.ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడ మే మేలని, నిరం తంరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందని యువతకు ఆయన ప్రబోధించారు. ధీరులు అపజయాలను చూసి కుంగి పోరని, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించక పోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలని అనేవారు. ఓటమి కంటే విజయం బాధ్యతను పెంచుతుని, విజేతలు ఏవిధంగా ఉండా లో కూడా వివేకానంద తెల్పారు. విజయం సాధించామని విర్రవీగరాదని, విజయం నుండి వినయాన్ని నేర్చు కోవాలని సందే శాన్నిచ్చారు. అట్లే లక్ష్య సాధనలో పరాజి తులు విజయాన్ని ఎలా కైవసం చేసుకో వాలో కూడా ఆయన యువతరానికి తెల్పారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాస క్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించా లని, విజయానికి అసలు రహస్యం ఇదేన ని అన్నారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగిన వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడిం చలేదనేది ఆయన భావన. ఉత్సాహంతో శ్రమించడం,అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయాన్ని కాంక్షి ంచే వారికుండే ప్రాథమిక లక్షణాలని అనేవారు. ఒక్కరోజులో దేనిని సాధించలే మని, పట్టుదల వదలకుండా చేసే ప్రయ త్నం విజయాన్ని చేకూర్చుందనే సత్యాన్ని యువత గుండెల్లో నాటుకునేలా నొక్కి చెప్పారు. నిరాశ కమ్ముకున్న ప్రతిక్షణాన ‘‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ అని వివేకా చెప్పిన సూక్తే యువతరా న్ని చైతన్య పథం వైపుకు అడుగులు వేయి స్తుంది. భార తీయ యువతరంలో ఆయన గమ నించిన ప్రధాన లోపం భయం. మనిషి పతానికైనా-పాపానికై నా భయ మే ప్రధా నకారణమని, భయంలోనే చావు ఉందనే అభిప్రాయాన్ని వివేకానం దుడు వ్యక్తం చేశారు. ‘బలమే జీవనం. బల హీనమే మరణం’’అని ఆయన ఇచ్చిన సందేశం మానవజాతికే అతి గొప్ప సం దేశం. మనిషి శరీరాన్ని ధరించినప్పు డు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధ లను అనుభవించి తీరాల్సిందేనని, అం దుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండని ఉద్భోదించా రు. అత్యున్నత మైన ఆదర్శాన్ని కలిగి యువతరం ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఈర్ష్యాను స్వార్ధాన్ని వదిలి పెడితే ప్రపంచాన్నే కదిలించవ చ్చునని ఆయన బలంగా నమ్మేవారు.బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకునే వారు. ‌చేసేది చిన్న పనైనా శ్రద్ధతో సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్నిస్తుందని, కావున ప్రతి వ్యక్తి తాను చేయగల పని చిన్నదైనా శ్రద్ధతో నిర్వహించాలని ప్రబో ధించారు. సమాజాన్ని సంస్కరించాలనుకునే వారు ముందుగా తమను తాము సంస్కరించుకో వాలని ఆయన తెల్పారు. యువత సచ్ఛీ లత కలిగిఉండాలని ఆయన ప్రతిసారి చెబుతూ ఉండేవారు.భారతీయ యువతరం యెక్క శక్తి సామర్ధ్యాలపై వివేకా నందునికి అంచంచలమైన విశ్వాసం ఉంది. భావి భారత భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందని, దేశ తల రాతలు మార్చగలిగే సత్తా వారికే మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మారు. అలాంటి యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా చైతన్యపర్చడానికి ప్రయత్నించా రు. వివేకానందుని బోధనలు, సూ క్తులు కేవలం భారతీయ యువతరానికి మాత్రమే పరిమితం కాదు. ‌ప్రపంచంలో నిరాశ, నిస్పృహలతో సతమతమవు తున్న యువతరానికి ఆయన సూక్తులు చైతన్య ప్రబోధాలు.‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు’’ అని యువత రానికి వివేకానందుడు ఆధునిక భగవద్గీ తను బోధించారు. వివేకానందు డు నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రబో ధాలు, సూక్తులు సజీవంగా యువతరా నికి ప్రేరణ కలుగజేస్తూనే ఉంటాయి. యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న వివేకానందుడు జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం.

‘‘‌లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’
‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది.
అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పున్నమి ప్రత్యేక కథనం
‘‘ఇనుప నరాలు,ఉక్కు కండ రాలున్న వంద మంది యువకు లను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ పక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవా్య ప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందే హంగా స్వామి వివేకానందు డిదే. ఆధు నిక భారతదేశం ప్రపంచం లోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. ప్రజ్ఞలో, మేధా సంపత్తిలో భారతీ యులు మరెవరికి తక్కువ కాదని నిరూపించడం ద్వారా,ముఖ్యంగా భార తీయ యువతరంలో చైతన్యంనిం పడా నికి, ఆత్మ విశ్వాసం కలిగించ డానికి ఆయన తన జీవితమంతా కృషి చేశారు.

ఆలోచన పటిమ, నిర్ణయ సామర్ధ్యం, వెనుదిరగని ఆచరణ, ధైర్యంతో ఫలితా లను స్వీకరించగలిగే ధీరత్వాన్ని యువకుల హృదయాల్లో ప్రతిష్ఠించడానికి వివేకా నంద ఎంత గానో ప్రయత్నించారు. భావి భారతీయ తరాలకు ఎన్నటికీ తరగని కార్యదక్షత, స్ఫూర్తిని అందజేయడం కోసం ఆయన అలుపెర గని పరిశ్రమ చేశారు. ఏ ‌దేశంలోనైనా మంచి మార్పు రావడానికి ఏళ్ల తరబడి శ్రమించాల్సిన అవసరంలేదని, యువ జనులంతా మనస్ఫూర్తిగా కలిసికట్టుగా పరిశ్రమిస్తే కొద్ది రోజుల్లోనే మార్పు సాధ్యమౌతుందని వివేకానందుని భావన. ప్రపంచ దేశాలను తిరిగిన ఆయన వివిధ దేశాలలోని యువతరానికి భారతీ య యువ తరానికి ఆలోచన విధానం లోను, మనస్తత్వంలోను ఉన్న భేదాలను ప్రస్ఫుటంగాగమనించారు.భారతదేశం ఎదుర్కొంటు న్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమ స్యల కంటే అతి పెద్ద సమస్య ఇక్కడి యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవ డమేనని వివేకానంద భావించారు. ఆయన తన ప్రసంగాలతో, పుస్తకాలతో, సూక్తులతో యువతరా న్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు. ఓటమిని జీర్ణిం చుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరా శకు గురై కృంగిపో యే భారతీయ యువతరాన్ని వివేకా నంద తన బోధ నలతో చైతన్యపర్చారు. పరాజయాల నుండి గుణపాఠాలు నేర్చు కోవాలని, ఓటమి అనేది అపకారి కాదని, అవి జీవితానికి మెరుగులు దిద్దుతుందని ఆయన భావన.ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడ మే మేలని, నిరం తంరం శ్రమించే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుందని యువతకు ఆయన ప్రబోధించారు.

ధీరులు అపజయాలను చూసి కుంగి పోరని, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించక పోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలని అనేవారు. ఓటమి కంటే విజయం బాధ్యతను పెంచుతుని, విజేతలు ఏవిధంగా ఉండా లో కూడా వివేకానంద తెల్పారు. విజయం సాధించామని విర్రవీగరాదని, విజయం నుండి వినయాన్ని నేర్చు కోవాలని సందే శాన్నిచ్చారు. అట్లే లక్ష్య సాధనలో పరాజి తులు విజయాన్ని ఎలా కైవసం చేసుకో వాలో కూడా ఆయన యువతరానికి తెల్పారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాస క్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించా లని, విజయానికి అసలు రహస్యం ఇదేన ని అన్నారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత కలిగిన వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడిం చలేదనేది ఆయన భావన. ఉత్సాహంతో శ్రమించడం,అలసటను ఆనందంగా అనుభవించడం అనేవి విజయాన్ని కాంక్షి ంచే వారికుండే ప్రాథమిక లక్షణాలని అనేవారు. ఒక్కరోజులో దేనిని సాధించలే మని, పట్టుదల వదలకుండా చేసే ప్రయ త్నం విజయాన్ని చేకూర్చుందనే సత్యాన్ని యువత గుండెల్లో నాటుకునేలా నొక్కి చెప్పారు.
నిరాశ కమ్ముకున్న ప్రతిక్షణాన ‘‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’’ అని వివేకా చెప్పిన సూక్తే యువతరా న్ని చైతన్య పథం వైపుకు అడుగులు వేయి స్తుంది. భార తీయ యువతరంలో ఆయన గమ నించిన ప్రధాన లోపం భయం. మనిషి పతానికైనా-పాపానికై నా భయ మే ప్రధా నకారణమని, భయంలోనే చావు ఉందనే అభిప్రాయాన్ని వివేకానం దుడు వ్యక్తం చేశారు. ‘బలమే జీవనం. బల హీనమే మరణం’’అని ఆయన ఇచ్చిన సందేశం మానవజాతికే అతి గొప్ప సం దేశం. మనిషి శరీరాన్ని ధరించినప్పు డు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధ లను అనుభవించి తీరాల్సిందేనని, అం దుకే దృష్టిని బాధలపై ఉంచకుండా పరిష్కారం పై ఉంచండని ఉద్భోదించా రు. అత్యున్నత మైన ఆదర్శాన్ని కలిగి యువతరం ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఈర్ష్యాను స్వార్ధాన్ని వదిలి పెడితే ప్రపంచాన్నే కదిలించవ చ్చునని ఆయన బలంగా నమ్మేవారు.బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకునే వారు. ‌చేసేది చిన్న పనైనా శ్రద్ధతో సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్నిస్తుందని, కావున ప్రతి వ్యక్తి తాను చేయగల పని చిన్నదైనా శ్రద్ధతో నిర్వహించాలని ప్రబో ధించారు. సమాజాన్ని సంస్కరించాలనుకునే వారు ముందుగా తమను తాము సంస్కరించుకో వాలని ఆయన తెల్పారు. యువత సచ్ఛీ లత కలిగిఉండాలని ఆయన ప్రతిసారి చెబుతూ ఉండేవారు.భారతీయ యువతరం యెక్క శక్తి సామర్ధ్యాలపై వివేకా నందునికి అంచంచలమైన విశ్వాసం ఉంది. భావి భారత భవిష్యత్తు యువతరం చేతిలోనే ఉందని, దేశ తల రాతలు మార్చగలిగే సత్తా వారికే మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మారు. అలాంటి యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా చైతన్యపర్చడానికి ప్రయత్నించా రు. వివేకానందుని బోధనలు, సూ క్తులు కేవలం భారతీయ యువతరానికి మాత్రమే పరిమితం కాదు. ‌ప్రపంచంలో నిరాశ, నిస్పృహలతో సతమతమవు తున్న యువతరానికి ఆయన సూక్తులు చైతన్య ప్రబోధాలు.‘‘ఈ ప్రపంచంలో వున్న సకల శక్తి నీలో వుంది. అసమర్ధుడునని భావించకు. నీవు ఏమైనా చేయగలవు. అన్నింటిని సాధించగలవు’’ అని యువత రానికి వివేకానందుడు ఆధునిక భగవద్గీ తను బోధించారు. వివేకానందు డు నేడు భౌతికంగా లేకపోయినా ఆయన ప్రబో ధాలు, సూక్తులు సజీవంగా యువతరా నికి ప్రేరణ కలుగజేస్తూనే ఉంటాయి. యువశక్తికి నిత్యం కొత్త ప్రేరణ అందించే మహనీయునిగా ప్రపంచ నీరాజనాలు అందుకున్న వివేకానందుడు జన్మించిన గడ్డపై జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.