నెల్లూరు: (పున్నమి ప్రతినిధి)
యుగపురుషుడు, స్వర్గీయ పద్మశ్రీ డా. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హజరతయ్య టీచర్ (వీఆర్ఎస్), బ్రాహ్మిన్ స్ట్రీట్, మూలపేట, నెల్లూరు వారు పాల్గొన్నారు. డా. ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.


