అనకాపల్లి జిల్లా జనవరి 23 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి పట్టణంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ శ్రీ పప్పల చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు హాజరయ్యారు. ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేయగా, కొక్కిరాపల్లిలోని ప్రేమ సమాజానికి, భవనం వీధిలోని వేద పాఠశాలకు కాయగూరలు, నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, మండల అధ్యక్షులు లాలం భరత్, యువ నాయకులు ప్రగడ రాజు, లక్కవరం పీఏసీఎస్ చైర్మన్ కొలకలూరి విజయరామరాజు, జిల్లా నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు: పేదలకు అన్నదానం, నిత్యావసరాల పంపిణీ
అనకాపల్లి జిల్లా జనవరి 23 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి పట్టణంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ శ్రీ పప్పల చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు హాజరయ్యారు. ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేయగా, కొక్కిరాపల్లిలోని ప్రేమ సమాజానికి, భవనం వీధిలోని వేద పాఠశాలకు కాయగూరలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, మండల అధ్యక్షులు లాలం భరత్, యువ నాయకులు ప్రగడ రాజు, లక్కవరం పీఏసీఎస్ చైర్మన్ కొలకలూరి విజయరామరాజు, జిల్లా నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిలు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

