Wednesday, 18 March 2026
  • Home  
  • మొర్రపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – సైకిల్‌పై వెళ్తున్న బాలుడు మృతి
- రాజన్న సిరిసిల్ల

మొర్రపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – సైకిల్‌పై వెళ్తున్న బాలుడు మృతి

ముస్తా బాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తా బాద్ లోని మొర్రపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది మొర్రాపూర్. గ్రామానికి చెందిన భూక్య యాదగిరి కుమారుడు భూక్యా ఇషాన్ అనే బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సైకిల్‌పై బయటకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మొర్రపూర్ నుంచి కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్, బాలుడు ప్రయాణిస్తున్న సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇషాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు 3వ తరగతి చదువుతున్న విద్యార్థిగా తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ముస్తా బాద్ మార్చి పున్నమి ప్రతినిధి
ముస్తా బాద్ లోని మొర్రపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది మొర్రాపూర్. గ్రామానికి చెందిన భూక్య యాదగిరి కుమారుడు భూక్యా ఇషాన్ అనే బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సైకిల్‌పై బయటకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మొర్రపూర్ నుంచి కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్, బాలుడు ప్రయాణిస్తున్న సైకిల్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇషాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు 3వ తరగతి చదువుతున్న విద్యార్థిగా తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.