ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
భాద్రపద మాసము వచ్చింది అంటే వచ్చే ప్రధాన పండుగ వినాయక చవితి.
ఖమ్మం నగరం లో వినాయక చవితి హడావిడి శనివారం నుండి ప్రారంభం అయింది. వినాయక మండపలు ని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.. గణ నాధుని యొక్క విగ్రహాలు ని కూడా కొనుగోలు చేసి మండపల దగ్గర కి తరలిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం నగరం లో ఈ సారి భారీ స్థాయి లో వినాయక మండపలు ఏర్పాటు కానునున్నాయి. 27 వ ఆగష్టు బుధవారం నుండి ప్రారంభం అయ్యే చవితి ఉత్సవాలు సెప్టెంబర్ 6 వ తేదీ శనివారం తో ముగుస్తాయి అని ఖమ్మం నగర గణేష్ ఉత్సవ కమిటి బాద్యులు లాహోటి, జైపాల్ రెడ్డి, గెంటల విద్యాసాగర్ లు తెలిపారు. అనుమతి తీసుకోవడం తప్పని సరి అని, ప్రశాంత వాతావరణం లో ఉత్సవాలు జరుపుకోవాలని నగర పోలీస్ లు కోరుతున్నారూ.


