గద్వాల్ నవంబర్ 4 (పున్నమి ప్రతినిధి)
జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామం నందు నేడు
అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారి చేతుల మీదుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు,,
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు లేకుంటే నేటి సమాజానికి తినడానికి తిండి లేదు… కావున రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటూ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం ఉండాలని… ఎమ్మెల్యే గారు అన్నారు. అనంతరం నా రైతులకు నేను అండగా ఉంటానని ఆయన అన్నారు, అలాగే రైతులు ఎమ్మెల్యే గారికి శాలువతో సత్కరించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


