కోవూరులో వైసిపికి షాకుల మీద షాకులు
చంద్రబాబు సమక్ష్యంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్న వైసిపి ఎంపీటీసీ
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనికి చేరిన వేళా విశేషమా.. మార్పు కోరుతున్న ప్రజాభీష్టానికి సంకేతమా.. కారణమేదైతేనేం వలసలతో కోవూరు వైసిపి విల విల లాడుతోంది. ఇప్పటికే వలసలతో సగం ఖాళీ అయిన కోవూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ యిచ్చారు మైపాడుకు చెందిన గంపల సుబ్రహ్మణ్యం దంపతులు. ఇందుకూరుపేట మండలం మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి వైసిపికి ఛీ కొట్టి టిడిపికి జై కొట్టారు. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపి సుప్రీం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి ఆమె భర్త గంపల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలో గంపల జయంతి దంపతులను మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారు అభినందించారు. వీరితో పాటు పడుగుపాడుకు శ్రీహరి కూడా వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన గంపల జయంతి దంపతులు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో జరగాలంటే పాలనా అనుభవమున్న చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమన్నారు. కోవూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీ అభ్యర్థులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్ల విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి వైసిపికి ఛీ కొట్టి చంద్రబాబు సమక్షంలో టిడిపికి జై కొట్టారు
కోవూరులో వైసిపికి షాకుల మీద షాకులు చంద్రబాబు సమక్ష్యంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్న వైసిపి ఎంపీటీసీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనికి చేరిన వేళా విశేషమా.. మార్పు కోరుతున్న ప్రజాభీష్టానికి సంకేతమా.. కారణమేదైతేనేం వలసలతో కోవూరు వైసిపి విల విల లాడుతోంది. ఇప్పటికే వలసలతో సగం ఖాళీ అయిన కోవూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ యిచ్చారు మైపాడుకు చెందిన గంపల సుబ్రహ్మణ్యం దంపతులు. ఇందుకూరుపేట మండలం మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి వైసిపికి ఛీ కొట్టి టిడిపికి జై కొట్టారు. వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపి సుప్రీం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మైపాడు బిట్ 1 ఎంపీటీసీ గంపల జయంతి ఆమె భర్త గంపల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలో గంపల జయంతి దంపతులను మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారు అభినందించారు. వీరితో పాటు పడుగుపాడుకు శ్రీహరి కూడా వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన గంపల జయంతి దంపతులు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో జరగాలంటే పాలనా అనుభవమున్న చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమన్నారు. కోవూరు ఎమ్మెల్యే నెల్లూరు ఎంపీ అభ్యర్థులైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్ల విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.