Wednesday, 25 March 2026
  • Home  
  • మైనర్ గిరిజన బాలికల ఆచూకీ లభ్యం
- భద్రాద్రి కొత్తగూడెం

మైనర్ గిరిజన బాలికల ఆచూకీ లభ్యం

మైనర్ గిరిజన బాలికల ఆచూకీ లభ్యం. అంకంపాలెం లో కలకలం రేపిన ఘటనకు చెక్. పోలీసులను అభినందించిన కళాశాల యాజమాన్యం. పున్నమి ప్రతినిధి – 13 అక్టోబర్ మండల పరిదిలోని అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాళాలలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన స్ధానికంగా కలకలం రేపిన సంగతి గ్రామస్ధులు మరువక ముందే పోలీసులు బాలికల ఆచూకీ తెలుసుకున్నారు. ఖమ్మం బస్టాండ్ లో పోలీసులు బృందలుగా ఏర్పడి గాలింపులు చేయగా బస్టాండ్ లో సోమవారం రాత్రి పట్టుబడ్డారు.. దీంతో కళాశాల యాజమాన్యం ,విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారికంగా పూర్తి వివరాలను పోలీసులు వివరించాల్సి ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సమీపంలోని రేగళ్ళపాడుకు చెందిన ఇద్దరు గిరిజన మైనర్ బాలికలు ,దమ్మపేట మండలం అంకంపాలెం లో ఉన్న గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుచున్నారు. పాఠశాల అధ్యాపక బృందానికి సమాచారం ఇవ్వకుండా ఆదివారం బయటకు వెళ్ళారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్ధినిల తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు ,బంధువుల తో కలిసి చుట్టుపక్కల పల్లెల్లో ,గ్రామాల్లో ఆచూకీ కోసం యత్నాలు చేశారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం రాత్రి షుమారుగా 11 గం.ల సమయంలో దమ్మపేట పోలీసులకు లెక్చరర్ బాణోత్ హరిత ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో బాగంగా ఖమ్మం బస్టాండ్ లో పోలీసులకు బాలికలు పట్టుబడటంతో కళాశాల అద్యాపకులు ,తలిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

మైనర్ గిరిజన బాలికల ఆచూకీ లభ్యం.

అంకంపాలెం లో కలకలం రేపిన ఘటనకు చెక్.

పోలీసులను అభినందించిన కళాశాల యాజమాన్యం.

పున్నమి ప్రతినిధి – 13 అక్టోబర్

మండల పరిదిలోని అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాళాలలో ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన స్ధానికంగా కలకలం రేపిన సంగతి గ్రామస్ధులు మరువక ముందే పోలీసులు బాలికల ఆచూకీ తెలుసుకున్నారు. ఖమ్మం బస్టాండ్ లో పోలీసులు బృందలుగా ఏర్పడి గాలింపులు చేయగా బస్టాండ్ లో సోమవారం రాత్రి పట్టుబడ్డారు.. దీంతో కళాశాల యాజమాన్యం ,విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారికంగా పూర్తి వివరాలను పోలీసులు వివరించాల్సి ఉంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సమీపంలోని రేగళ్ళపాడుకు చెందిన ఇద్దరు గిరిజన మైనర్ బాలికలు ,దమ్మపేట మండలం అంకంపాలెం లో ఉన్న గిరిజన బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుచున్నారు. పాఠశాల అధ్యాపక బృందానికి సమాచారం ఇవ్వకుండా ఆదివారం బయటకు వెళ్ళారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్ధినిల తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. తల్లిదండ్రులు ,బంధువుల తో కలిసి చుట్టుపక్కల పల్లెల్లో ,గ్రామాల్లో ఆచూకీ కోసం యత్నాలు చేశారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం రాత్రి షుమారుగా 11 గం.ల సమయంలో దమ్మపేట పోలీసులకు లెక్చరర్ బాణోత్ హరిత ఫిర్యాదు చేశారు. ఉపాద్యాయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో బాగంగా ఖమ్మం బస్టాండ్ లో పోలీసులకు బాలికలు పట్టుబడటంతో కళాశాల అద్యాపకులు ,తలిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.