సీతారామపురం సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి)
వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల వ్యవహారంపై కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణలకు నిరసనగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ని సందర్శిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి యువజన, విద్యార్థి విభాగం నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి హయాంలోనే రాష్ట్రంలో 17 మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయగా అందులో ఐదు మెడికల్ కాలేజీ లను వైసిపి ప్రభుత్వం లోనే ప్రజలకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చి క్లాసులను కూడా ప్రారంభించడం జరిగిందని మరో 12 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి నాయకులకు కనిపించలేదా అని ఆయన కూటమి నాయకులపై విరుచకపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మెడికల్ కాలేజీ ల నిర్మాణాలు జరగలేదని కూటమి నాయకుల ఆరోపణలను దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కూటమి నాయకులకు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకు రాకపోగా ఇలాంటి విలువ లేని ఆరోపణలను వైసీపీపై చేయడం ప్రజలంతా గమనిస్తున్నారని, చంద్రబాబు మోసాలను అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను చంద్రబాబు నాయుడు తాను చేసినట్లుగా చెప్పుకుంటూ పబ్బంగడుపుకునే పరిస్థితికి వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పట్టదన్నారు. వైసిపి హయాం నుండే రాష్ట్రంలో ఐదు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లలో ప్రజలకు విద్యార్థులకు అందుతున్న వైద్యం విద్య కూటమి నాయకులకు కనిపించడం లేదా అని ఆయన విరుచుకుపడ్డారు.రాష్ట్ర అభివృద్ధిని మాటలలోనే గాని చేతలలో చూపించలేని అసమర్ధ పాలనను కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని కూటమి ప్రభుత్వంపై దుయ్యబట్టారు.


