మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం..
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
రైల్వే కోడూరు అక్టోబర్ 22 ( పున్నమి న్యూస్ ప్రతినిధి :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కళా శాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ బాధ్యులు, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో
23-10-2025 గురువారం నాడు కోడూరు మండలం చియ్యవరం గ్రామపంచాయతీ యస్ఆర్ కాలనీ నందు మధ్యాహ్నం 3:30 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడును కావున ఈ కార్యక్రమానికి మండలంలోని వైయస్సార్సీపి కార్యకర్తలు, జడ్పీటీసీలు,సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రతి ఒక్కరు హాజరుకావలసినదిగా ఒక మీడియా ప్రకటనలో తెలియజేశారు.


