ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
మెగా డీఎస్సీలో ప్రతిభచూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
డీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పిం చింది.
అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులనువిడుదల చేసింది.
గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు.
సెప్టెంబరు నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన 21 నుంచి
ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : మెగా డీఎస్సీలో ప్రతిభచూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పిం చింది. అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులనువిడుదల చేసింది. గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబరు నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు. రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

