Wednesday, 1 April 2026
  • Home  
  • ముస్తాబాద్‌లో బ్లాక్ డే నిర్వహణ– కార్మికుల డిమాండ్లు
- రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్‌లో బ్లాక్ డే నిర్వహణ– కార్మికుల డిమాండ్లు

ముస్తాబాద్ /ఏప్రిల్ / పున్నమి ప్రతినిధి ముస్తా బాద్ ఏప్రిల్ 1న సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సవరించాలని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడం వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే 12వ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించడం ఆపాలని, కార్మికుల ఆరోగ్య రక్షణ పేరిట జరుగుతున్న ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పిట్ల ప్రవీణ్, సులూరు సత్తయ్య, చినుగురు దేవయ్య, అంజయ్య, సంజీవ్, నరేష్, రాజేందర్, శంకర్, లోకం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల కార్మికులు ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముస్తాబాద్ /ఏప్రిల్ / పున్నమి ప్రతినిధి
ముస్తా బాద్ ఏప్రిల్ 1న సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సవరించాలని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడం వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే 12వ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 13న జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించడం ఆపాలని, కార్మికుల ఆరోగ్య రక్షణ పేరిట జరుగుతున్న ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో పిట్ల ప్రవీణ్, సులూరు సత్తయ్య, చినుగురు దేవయ్య, అంజయ్య, సంజీవ్, నరేష్, రాజేందర్, శంకర్, లోకం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల కార్మికులు ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.