*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అన్ని విభాగాలు సమన్వయంతో చర్యలు*
*క్షేత్ర స్థాయిలో యువనాయకులు, ఐటీ మంత్రి నారా లోకేష్ చురుకైన సమన్వయం*
*తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:* రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు యారాడ ప్రాంతంలో ఇరిగిపోయిన కొండచరియలు, లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షపు నీరు, డ్రైనేజ్ వాటర్ ఓవర్‌ఫ్లో అవుతున్న ప్రాంతాలను మరియు ఇతర ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి బాధితులను పరామర్శించారు. స్థానిక ప్రజల పరిస్థితిని తెలుసుకొని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. మెంథా’ తుఫాన్ ఉగ్రరూపం దాల్చబోతున్నందున, రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవిగా మారాయి. తీరప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, అవసరం లేని బయటకు వెళ్లడాన్ని నివారించాలి,” అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
పరిస్థితి చేయజారిపోకముందే నాయకులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిద్ధంగా ఉండాలి. ప్రజల భద్రతే మన ప్రథమ కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు తీరప్రాంతం, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం సురక్షిత వసతిగృహాలకు తరలించారని తెలిపారు.
*తుఫాన్ సహాయక చర్యల్లో టీడీపీ, కూటమి నాయకుల చురుకైన భాగస్వామ్యం*
టీడీపీ మరియు కూటమి కార్యకర్తలు ఈ సహాయక చర్యల్లో ముందుండి సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. రాబోయే 48 గంటలపాటు కూడా ఇదే క్రమశిక్షణ, నిబద్ధత కొనసాగించాలి. కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు తోడుగా, అధికారులకు అందుబాటులో ఉండాలి,” అని పల్లా శ్రీనివాసరావు గారు సూచించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఆయనే స్వయంగా విభాగాల పనితీరును సమీక్షిస్తూ ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారని పల్లా గారు వివరించారు. మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు గత రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఫీల్డ్ స్థాయి సమస్యలను రియల్ టైమ్‌లో పరిష్కరిస్తున్నారు. ఆయన కృషి, నిబద్ధత అభినందనీయమైనవి అని ఆయన అన్నారు.
*వైఎస్సార్సీపీ నేతల తప్పుడు ప్రచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది*
ఈ అత్యవసర సమయంలో కూడా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో పాత తుఫాన్ల (హుద్‌హుద్, టిట్లీ) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడం ఖండనీయమని పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయం చేయలేకపోతే కనీసం ప్రజల్లో భయం సృష్టించకండి. సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వాడండి. మనమందరం ఐక్యంగా ఈ సవాళ్లను ఎదుర్కొని నిలబడతాం అని పల్లా గారు అన్నారు.
ఈ కష్టసమయంలో ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్సార్సీపీ పాత తుఫాన్ల ఫోటోలు, వీడియోలు ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఇది ప్రజల్లో గందరగోళం, భయాందోళనలు సృష్టించడానికి చేసిన అప్రజాస్వామిక చర్య,” అని పల్లా శ్రీనివాసరావు గారు విమర్శించారు. ఈ విపత్తు సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి. సహాయం చేయలేకపోయినా, కనీసం అబద్ధపు ప్రచారాలతో భయం వ్యాప్తి చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.


