పున్నమి న్యూస్ ప్రతినిధి
09ఫిబ్రవరి 2026
9640204826
మీధాని కాలనీలో రూ.1 కోటి 36 లక్షల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మీధాని కాలనీలో సుమారు రూ.1 కోటి 36 లక్షల వ్యయంతో చేపట్టిన సమగ్ర అభివృద్ధి పనులు పూర్తికాగా, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి గారు, డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు కలిసి ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ అభివృద్ధి పనులలో భాగంగా
భూగర్భ డ్రైనేజ్
సీసీ రోడ్లు
పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, మీధాని కాలనీ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్, రోడ్లు మరియు పార్క్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను ప్రత్యేకంగా మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మరియు కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా హయత్ నగర్ డివిజన్లో ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి శాశ్వత పరిష్కారాలు అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని, భవిష్యత్తులో కూడా డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కృష్ణ, ముస్తఫా, రమేష్ రెడ్డి, మల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జె. అంజయ్య గౌడ్, గోపాల్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, జంగారెడ్డి, జగన్నాథ్, నలేష్ ఏ., వెంకట్ రెడ్డి, ఎం. మహేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, బాల శివ రెడ్డి, యుగేందర్ రెడ్డి, కె. వెంకట్ రెడ్డి, నెహ్రూ నాయక్, రవీందర్ రెడ్డి, సోమి రెడ్డి, బాలరాజ్ గౌడ్, సరిత, శోభ, సంద్య, చంద్ర మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
హయత్ నగర్ డివిజన్



