జోగులాంబ గద్వాల్ అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి)
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు మాలపేట కాలనీకి చెందిన మాల వీరేష్ కుటుంబానికి డ్రైవర్ల యూనియన్ మానవత్వాన్ని చాటుకుంది.
*డ్రైవర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా వీరేష్ కుటుంబానికి 36 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.*
గత వారం రోజుల క్రితం నాగర్ దొడ్డి–బింగి దొడ్డి మధ్య మార్గంలో వీరేష్ తండ్రి మాల ముక్కెన్న గారు ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని యూనియన్ నేతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, డ్రైవర్ వీరేష్ బైక్ యాక్సిడెంట్లో మరణించడం సాటి డ్రైవర్లకు తీవ్ర బాధాకరమని తెలిపారు. అలాగే అయిజ మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాల యజమానులు కూడా మానవత్వంతో ముందుకు వచ్చి వీరేష్ భార్య, పిల్లలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.అలాగే ప్రమాదంపై ఇప్పటివరకు మండల పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదని, త్వరలో బాధిత కుటుంబానికి న్యాయం జరగకుంటే డ్రైవర్ల యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభిస్తుందని గౌడ్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో *అయిజ మండల డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు తిరుమలేష్, ఉపాధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఎం.డి. నజీర్ తదితరులు పాల్గొన్నారు.*


