పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గం మెహబత్ నగర్, సిరిగిరిపురం గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీగా కాంగ్రెస్ లో చేరారు. తుక్కుగూడ కార్యాలయంలో మూడురంగుల కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కె ఎల్ ఆర్ అనంతరం కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు హస్తం గూటికి చేరారు.
ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ… కొత్తగా వచ్చిన ఇతర పార్టీల నాయకులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. కొత్త- పాత నాయకులు కలిసి కట్టుగా పని చేసి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు.వచ్చే స్థానిక ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అడ్రస్ గల్లంతు ఖాయమని కె ఎల్ ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కి సరైన నాయకత్వం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనాకర్షక పథకాలు పేదలకు అమలు అవుతున్నాయని… తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి పల్లె ప్రజలు అండగా నిలవాలని కిచ్చెన్న కోరారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు మండలాల నాయకులు సహా అన్ని విభాగాల నాయకులు, నాయకురాళ్లు, గ్రామకమిటీలు పాల్గొన్నాయి.

*మహేశ్వరం నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ అడ్రస్ గల్లంతు: కే ఎల్ ఆర్ * –కిచ్చెన్న ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ లో చేరికలు –త్వరలో హస్తం గూటికి బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకులు*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గం మెహబత్ నగర్, సిరిగిరిపురం గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీగా కాంగ్రెస్ లో చేరారు. తుక్కుగూడ కార్యాలయంలో మూడురంగుల కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కె ఎల్ ఆర్ అనంతరం కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ… కొత్తగా వచ్చిన ఇతర పార్టీల నాయకులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. కొత్త- పాత నాయకులు కలిసి కట్టుగా పని చేసి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు.వచ్చే స్థానిక ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అడ్రస్ గల్లంతు ఖాయమని కె ఎల్ ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కి సరైన నాయకత్వం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనాకర్షక పథకాలు పేదలకు అమలు అవుతున్నాయని… తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి పల్లె ప్రజలు అండగా నిలవాలని కిచ్చెన్న కోరారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు మండలాల నాయకులు సహా అన్ని విభాగాల నాయకులు, నాయకురాళ్లు, గ్రామకమిటీలు పాల్గొన్నాయి.

