పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మేజార్టీతో గెలిపించి అగ్రనేత రాహుల్ గాంధీజీ, సీఎం రేవంత్ రెడ్డి కు బహుమతి ఇద్దామని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. డివిజన్లు, బూతుల వారీగా ఇంటింటి ప్రచారం చేయాలని హస్తం నేతలకు కేఎల్ఆర్ సూచించారు. ఇప్పటికే పలువురు నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళ నేతలు విడతల వారీగా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి డిపాజిట్ గల్లంతు ఖాయమన్నారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నేతలు సెంటిమెంట్ తో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ లో అన్ని కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని లక్ష్మారెడ్డి అన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరంలోని చెరువులు, పార్కులను కబ్జా చేసి నాశనం చేశారని కిచ్చెన్నగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

*మహేశ్వరం టు జూబ్లీహిల్స్ కు హస్తం నేతలు* —ఇప్పటికే పలువురి నేతలకు ప్రచారం బాధ్యతలు —నవీన్ యాదవ్ గెలుపు- జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు* — బిఆర్ఎస్ & బీజేపీ లపై కాంగ్రెస్ నేత కెఎల్ఆర్ ఆగ్రహం
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మేజార్టీతో గెలిపించి అగ్రనేత రాహుల్ గాంధీజీ, సీఎం రేవంత్ రెడ్డి కు బహుమతి ఇద్దామని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం మహేశ్వరం నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. డివిజన్లు, బూతుల వారీగా ఇంటింటి ప్రచారం చేయాలని హస్తం నేతలకు కేఎల్ఆర్ సూచించారు. ఇప్పటికే పలువురు నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళ నేతలు విడతల వారీగా ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి డిపాజిట్ గల్లంతు ఖాయమన్నారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నేతలు సెంటిమెంట్ తో ఓటర్లను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ లో అన్ని కాలనీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని లక్ష్మారెడ్డి అన్నారు. 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరంలోని చెరువులు, పార్కులను కబ్జా చేసి నాశనం చేశారని కిచ్చెన్నగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

