మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – నెల్లూరు పోలీసులు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని “శక్తి యాప్” అవసరంపై పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రదేశాలలో ప్రజలకు, మహిళలకు, విద్యార్థినిలకు శక్తి యాప్ వినియోగంపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్ను ప్రతి మహిళ తప్పనిసరిగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందిస్తారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 1098, 1930 వంటి అత్యవసర నంబర్ల గురించి ప్రజలకు తెలియజేశారు.

మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – నెల్లూరు పోలీసులు
మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – నెల్లూరు పోలీసులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని “శక్తి యాప్” అవసరంపై పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రదేశాలలో ప్రజలకు, మహిళలకు, విద్యార్థినిలకు శక్తి యాప్ వినియోగంపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్ను ప్రతి మహిళ తప్పనిసరిగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందిస్తారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 1098, 1930 వంటి అత్యవసర నంబర్ల గురించి ప్రజలకు తెలియజేశారు.

