ఖమ్మం ఏప్రిల్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు జ్వాల నరసింహరావు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ యాదవ్, మండల అధ్యక్షులు వాకదని రామకృష్ణ యాదవ్, దానియాకుల వెంకట్ నారాయణ యాదవ్, రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్, కుమిలి శ్రీనివాస్ తదితర మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.



