Sunday, 7 December 2025
  • Home  
  • మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల
- ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, సిబ్బంది, ప్రజా ప్రతినిధులకి శిక్షణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ (ఆర్.జి.ఎస్.ఏ.) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు జత చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికీ, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ లలన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అందించేందుకు తగిన ఆదేశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది.
రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, సిబ్బంది, ప్రజా ప్రతినిధులకి శిక్షణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ (ఆర్.జి.ఎస్.ఏ.) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు జత చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికీ, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ లలన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అందించేందుకు తగిన ఆదేశాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.