రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి
పూలే జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలోని అజ్ఞాన చీకట్లను తొలగించి విద్య అనే వెలుగును ప్రసారించిన మహనీయుడు పూలే సేవలను స్మరించుకుంటూ వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా పూలే సమాజ సంస్కరణలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడం, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, సమానత్వం కోసం పోరాడడం వంటి గొప్ప కార్యక్రమాలను ఆయన చేపట్టారని తెలిపారు. ఆ కాలంలో సామాజిక అసమానతలను తొలగించేందుకు పూలే చేసిన కృషి వల్లనే సమాజంలో పెద్ద మార్పు వచ్చిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం మనం చూస్తున్న విద్యా విస్తరణ, సమాన హక్కులపై అవగాహన వంటి అంశాలకు పూలే చేసిన సేవలే పునాది అని వారు అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయం సందర్భంగా నేతల ఘన నివాళులు
రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి పూలే జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలోని అజ్ఞాన చీకట్లను తొలగించి విద్య అనే వెలుగును ప్రసారించిన మహనీయుడు పూలే సేవలను స్మరించుకుంటూ వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా పూలే సమాజ సంస్కరణలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడం, మహిళల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, సమానత్వం కోసం పోరాడడం వంటి గొప్ప కార్యక్రమాలను ఆయన చేపట్టారని తెలిపారు. ఆ కాలంలో సామాజిక అసమానతలను తొలగించేందుకు పూలే చేసిన కృషి వల్లనే సమాజంలో పెద్ద మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విద్యా విస్తరణ, సమాన హక్కులపై అవగాహన వంటి అంశాలకు పూలే చేసిన సేవలే పునాది అని వారు అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

