మల్లు గుంట గిరిజన కాలనీలో పర్యటించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు
వెంకటాచలం (పున్నమి, అక్టోబర్ 22):-
వెంకటాచలం మండలం మల్లు గుంట గిరిజన కాలనీని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీవ్ర వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ —
“గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మీకు ఏవైనా అవసరాలు ఉన్నా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కార్యాలయానికి తెలియజేయండి. ప్రభుత్వం పేద గిరిజనులకు అండగా ఉంటుంది” — అని తెలిపారు.
అలాగే, గత ప్రభుత్వ కాలంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యం పాలయ్యారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారిని అట్టడుగు స్థాయిలోంచి పైకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమినేని వాణి భవాని, నాయుడు పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

