ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: ఏర్పేడు మండలం మర్రిమంద పంచాయతీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ముఖ్య అతిథిగా విచెసారు. ఆమెకు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు బ్యాండ్ సెట్ వాయిద్యాలు, టపాకాయలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా రిషితా రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం సెలవు కారణంగా లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఒకరోజు ముందుగానే శనివారం నాడు పెన్షన్ల పంపిణీ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు తమకు అనుకూల సమయంలో రేషన్ పొందే వెసులుబాటు కల్పించామని ప్రభుత్వం బియ్యం, జొన్నలు, చక్కెర అందిస్తున్నట్లు ఆమె వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.4.5 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయగా, ఏర్పేడు మండలంలోనే దాదాపు కోటి రూపాయల సాయం అందిందని గుర్తు చేశారు. అనంతరం మల్లాడి డ్రగ్స్ కంపెనీ సహకారంతో మర్రిమంద ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేష్‌కు మూడు చక్రాల ఎలక్ట్రిక్ సైకిల్‌ను అందజేశాసి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను తిలకించి అభినందించారు. మండల అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు మాట్లాడుతూ…..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలంతా నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని మండలంలో జాతీయ రహదారుల నుంచి పంచాయతీ రోడ్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

మర్రిమందలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి రిషితా రెడ్డి