మనుబోలు,అక్టోబర్,12 (పున్నమి విలేఖరి) మనుబోలు మండలకేంద్రమైన మనుబోలు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది మనుబోలు పోలీసుల కధనం మేరకు వివరాలిలా వున్నాయి. గుంటూరు జిల్లా నరసావుపేటకు చెందిన బి సత్యనారాయణరెడ్డి టైల్స్ వ్యాపారంలో భాగంగా చెన్నైలోని హోల్ సేల్ టైల్స్ దుకాణంలో టైల్స్ కొనుగోలు చేసి తిరుగుప్రయాణంలో మార్గమధ్యమైన మనుబోలు వెంకటరమణ హోటల్ ఎదురుగా ఆగివున్న లారీని వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణరెడ్డి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలపాలయ్యారు. వృత్తిలో భాగంగా చెన్నైనుండి తిరిగి ఇంటికి వెలుతుండగా అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మనుబోలు జాతీయ రహదారిపై అడ్డదిడ్డంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపడంవలనే తరచూ ప్రమాదాలు చోటుచేసుఠుంటున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు. గాయాలపాలైన ముగ్గురిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సత్యనారాయణ రెడ్డి మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించి మనుబోలు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.