మనుబోలు20-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.
కాలనీలలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల పరిశీలన.
ప్రజలకు మాస్కులు, శానిటైజర్ల పంపిణి
మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి.
ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.
ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం.
అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం.
వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం.
వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి.
ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి.ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై. యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,చే రెడ్డి రామి రెడ్డి ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి దాసరి మహేంద్రవర్మ అన్నమాల ప్రభాకర్ రెడ్డి ఎంపీడీవో వెంకటేశ్వర్లు తహసిల్దార్ ఆనందరావు గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి మనుబోలు ఎస్ ఐ సూర్య ప్రకారెడ్డి పాల్గొన్నారు.
మనుబోలు గ్రామ ప్రజలకు ఆందోళన వద్దు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రెడ్ జోన్ ప్రాంతాలు పరిశీలన
మనుబోలు20-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . మండల స్థాయి అధికారులు, వైద్యులతో పరిస్థితిని సమీక్షించి, ప్రజలెవ్వరూ ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటూ, బహిరంగ ప్రకటన ద్వారా సూచనలు, సలహాలు అందజేసిన ఎమ్మెల్యే కాకాణి. కాలనీలలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల పరిశీలన. ప్రజలకు మాస్కులు, శానిటైజర్ల పంపిణి మనుబోలు బి.సి. కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల నివాసాలు ఉన్న వారికెవ్వరికీ కరోనా వ్యాప్తి చెందలేదు.కాలనీ వాసులందరూ ఆందోళన చెందకుండా, నివారణకు అవసరమైన చర్యలు తీసుకోండి. ఈ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల అవసరాలకు ప్రత్యేకాధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రజల అవసరాల కోసం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వాలంటీర్లను అందుబాటులో ఉంచాం. అవసరమైనన్ని మాస్కులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. వాలంటీర్ల ద్వారా మాస్కులను, శానిటైజర్లను, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తాం. వ్యాధి లక్షణాలు కానీ, అనుమానంగానీ ఉంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివృత్తి చేసుకోండి. ఎవరికీ ఏ అవసరమైనా అధికారులను సంప్రదించండి సమస్య పరిష్కారం కాకపోతే, నా దృష్టికి తీసుకొని రండి.ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై. యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,చే రెడ్డి రామి రెడ్డి ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి దాసరి మహేంద్రవర్మ అన్నమాల ప్రభాకర్ రెడ్డి ఎంపీడీవో వెంకటేశ్వర్లు తహసిల్దార్ ఆనందరావు గూడూరు రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి మనుబోలు ఎస్ ఐ సూర్య ప్రకారెడ్డి పాల్గొన్నారు.