Thursday, 5 February 2026
  • Home  
  • “మన వార్డు – మన బాధ్యత” పోస్టర్ ఆవిష్కరించిన SDPI రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్
- E-పేపర్

“మన వార్డు – మన బాధ్యత” పోస్టర్ ఆవిష్కరించిన SDPI రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్

నంద్యాలలో “మన వార్డు – మన బాధ్యత” కార్యక్రమం SDPI ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా SDPI రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ – “ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం SDPI ఈ సర్వే చేపట్టింది. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే అవి నేరుగా మా పార్టీ వార్డు ఇంచార్జి ద్వారా పరిష్కార దిశగా తీసుకెళ్లబడతాయి SDPI ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి న్యాయం సాధన కోసం పోరాటం చేస్తుంది. సామాన్య ప్రజల సమస్యలే మా ప్రధాన అజెండా” అని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గని మాట్లాడుతూ –”ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో SDPI ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తోంది. గాంధీజీ చూపిన అహింసా మార్గం, సమానత్వ భావనలను అనుసరిస్తూ మేము ప్రజలతో కలిసి నడుస్తున్నాం. మా పార్టీ కేవలం విమర్శలు చేయడం కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది” అని అన్నారు SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ –”నంద్యాల SDPI కార్యాలయం నుండి బయలుదేరి గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశాము. ఆ తర్వాత నడిగడ్డ వార్డుల్లో ‘మన వార్డు – మన బాధ్యత’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను గుర్తించి అధికారులకు తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చేలా కృషి చేయడం SDPI ప్రధాన కర్తవ్యం” అన్నారు రాష్ట్ర కార్యదర్శి తాహిర్ హుస్సేన్ మాట్లాడుతూ –”ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకపోతే, వాటిని బయటపెట్టి తగిన చర్యలు తీసుకునేలా మేము కృషి చేస్తాము. ప్రతి వార్డులో మా పార్టీ ఇంచార్జీలు ఉన్నారు. ప్రజలు తమ సమస్యలను వారితో పంచుకుంటే అవి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తీసుకెళ్లి పరిష్కరించబడతాయి. SDPI ఎప్పుడూ ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుంది” అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో SDPI రాష్ట్ర కమిటీ సభ్యులు , జిల్లా అసెంబ్లీ నాయకులు, పంచాయతీ నాయకులు,వార్డు నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో కలసి నడవడం, వారి సమస్యలను వినడం, పరిష్కారం చూపడం SDPI పార్టీ ధ్యేయం అని వారు పునరుద్ఘాటించారు.

నంద్యాలలో “మన వార్డు – మన బాధ్యత” కార్యక్రమం SDPI ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా SDPI రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ –
“ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం SDPI ఈ సర్వే చేపట్టింది. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే అవి నేరుగా మా పార్టీ వార్డు ఇంచార్జి ద్వారా పరిష్కార దిశగా తీసుకెళ్లబడతాయి SDPI ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి న్యాయం సాధన కోసం పోరాటం చేస్తుంది. సామాన్య ప్రజల సమస్యలే మా ప్రధాన అజెండా” అని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గని మాట్లాడుతూ –”ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో SDPI ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తోంది. గాంధీజీ చూపిన అహింసా మార్గం, సమానత్వ భావనలను అనుసరిస్తూ మేము ప్రజలతో కలిసి నడుస్తున్నాం. మా పార్టీ కేవలం విమర్శలు చేయడం కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది” అని అన్నారు SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ –”నంద్యాల SDPI కార్యాలయం నుండి బయలుదేరి గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశాము. ఆ తర్వాత నడిగడ్డ వార్డుల్లో ‘మన వార్డు – మన బాధ్యత’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను గుర్తించి అధికారులకు తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చేలా కృషి చేయడం SDPI ప్రధాన కర్తవ్యం” అన్నారు రాష్ట్ర కార్యదర్శి తాహిర్ హుస్సేన్ మాట్లాడుతూ –”ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకపోతే, వాటిని బయటపెట్టి తగిన చర్యలు తీసుకునేలా మేము కృషి చేస్తాము. ప్రతి వార్డులో మా పార్టీ ఇంచార్జీలు ఉన్నారు. ప్రజలు తమ సమస్యలను వారితో పంచుకుంటే అవి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తీసుకెళ్లి పరిష్కరించబడతాయి. SDPI ఎప్పుడూ ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుంది” అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో SDPI రాష్ట్ర కమిటీ సభ్యులు ,
జిల్లా అసెంబ్లీ నాయకులు, పంచాయతీ నాయకులు,వార్డు నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో కలసి నడవడం, వారి సమస్యలను వినడం, పరిష్కారం చూపడం SDPI పార్టీ ధ్యేయం అని వారు పునరుద్ఘాటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.