మధ్యప్రదేశ్, రాజస్థాన్లల్లో 11 మంది పిల్లల మృతికి, దీనికి సంబంధం ఉందనే అనుమానాలతో కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను కేరళ ప్రభుత్వం నిషేధించింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పిల్లల మృతి సంఘటనల తరువాత, కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్‌పై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ సిరప్‌లో హానికర రసాయనాలు ఉండి పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగించే అవకాశం ఉందని వైద్య అధికారులు గుర్తించారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఈ సిరప్ నమూనాలను పరీక్షకు పంపింది. ఫలితాలు వచ్చే వరకు అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలు ఈ సిరప్‌ను పిల్లలకు ఇవ్వకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.


