ఒంగోలు అక్టోబర్ 31న
ఒంగోలు నగరంలోని ఎస్.జి.వి.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో మద్దినేని శ్రీనివాసరావు – శ్రీమతి విజయ దంపతుల కుమార్తె కావ్య వివాహం, వరుడు నిఖిల్‌తో అంగరంగ వైభవంగా జరిగినది.
ఈ కార్యక్రమమునకు పలువురు ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు ప్రత్యేక అతిథులుగా హాజరై, నూతన వధూవరులకు తమ ఆశీర్వచనాలను అందించి, ఈ కొత్త జీవితము ప్రేమ, పరస్పర గౌరవం ఆనందోత్సాహాలతో నిండిపోవాలని కోరుకుంటూ కావ్య–నిఖిల్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు, రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను మరింత శోభాయమానం చేశారు.


