*మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
తుఫాను కారణంగా వేట నిషేధిత సహకారం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు సహాయం నిమిత్తం కూటమి ప్రభుత్వం 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 34వ వార్డులో పలువురు మత్స్యకారులు కు 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యాసర వస్తువులను ఎమ్మెల్యే గారి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని మరొకసారి నిరూపతమైందని తెలియజేశారు . తుఫాను వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు తీసుకునీ , నష్ట నివారణ చర్యలు చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎఎస్ఓ శ్రీహరి గారు, కూటమి నేతలు పాల్గొన్నారు..


