Thursday, 12 February 2026
  • Home  
  • భీమవరంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలు
- ఆంధ్రప్రదేశ్ - జాతీయ అంతర్జాతీయ - పశ్చిమ గోదావరి

భీమవరంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలు

భీమవరం : భీమవరంలో ఈనెల 21న న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు అందించే ట్రోఫీను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీలోని విజేతలకు ట్రోఫీలతోపాటు మూడు మోటార్ బైక్స్ , టీవీలు అందించడం గొప్ప విశేషమన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 21న భీమవరంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి బాడీ బిల్డర్లు హాజరుకానున్నారు, ఈ పోటీలను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో దాసి ప్రసాద్, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, బ్యాంక్ బాబీ, ఆకుల కృష్ణ, మున్న, హర్ష, జగదీష్, రిచి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.

భీమవరం : భీమవరంలో ఈనెల 21న న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్, మిస్టర్ ఆంధ్ర ఫిజిక్ మోడలింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు అందించే ట్రోఫీను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీలోని విజేతలకు ట్రోఫీలతోపాటు మూడు మోటార్ బైక్స్ , టీవీలు అందించడం గొప్ప విశేషమన్నారు.

అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం,

విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 21న భీమవరంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి బాడీ బిల్డర్లు హాజరుకానున్నారు,

ఈ పోటీలను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభిస్తారని తెలిపారు.

కార్యక్రమంలో దాసి ప్రసాద్, వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, బ్యాంక్ బాబీ, ఆకుల కృష్ణ, మున్న, హర్ష, జగదీష్, రిచి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.