కామారెడ్డి, 31అక్టోబర్, ( పున్నమి ప్రతినిధి ) :
రామారెడ్డి మండలంతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాలలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన రామారెడ్డి మండల కేంద్రం పోసానిపేట్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతు సమస్యలను ప్రత్యక్షంగా గమనించిన దశరథ్‌రెడ్డి, తడిసి నల్లబడిన ధాన్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొ న్నారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వరికి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, గత సీజన్‌లో రావలసిన బోనస్ తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే రెండునెలల క్రితం కురిసిన వర్షాలతో పంట లు నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టప రిహారం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించా రు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని ఆయ న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రామారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి, పోసానిపేట్ అధ్యక్షుడు టాంకర్ రవి, ఇసనపల్లి మాజీ సర్పంచ్ లింగాపూర్ శంకర్, పోసానిపేట్ రైతు బంధు మాజీ అధ్యక్షుడు తిరుపతి, ఉప సర్పంచ్ నరేష్, సుద్దాల లింగం, జంగం లింగం, బాల్దేవ్, చిన్న అంజయ్య, హనుమయల రాజయ్య, సొసైటీ మాజీ డైరెక్టర్ ఇసాయిపేట రాజు, బుచ్చి బాలయ్య, కర్రోల రాజేష్, తుత్తుల స్వామి తదితరులు పాల్గొన్నారు.


