Thursday, 26 March 2026
  • Home  
  • భారత ఆహార సంస్థ డివిజన్ కార్యాలయాన్నీ ప్రారంభించిన : కేంద్రమంత్రి
- తెలంగాణ

భారత ఆహార సంస్థ డివిజన్ కార్యాలయాన్నీ ప్రారంభించిన : కేంద్రమంత్రి

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్టు కేంద్ర ఆహార పౌరసరఫరాలు, వినియోదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ విపత్తులో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహారభద్రత కింద పేదలందరికీ ఐదు కిలోలు చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని ఇది 2030 వరకు కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల నివేదికలో భారత దేశంలో అత్యంత ఎక్కువమందికి ఆహారభద్రత కింద ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్టు వెల్లడించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరిస్తున్నామని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం దేశంలో ఉందని, తెలంగాణతో కలిపి 2023 –24 సంవత్సరంలో 2.25 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు ఖాతాలలో జమ చేసిందని తెలిపారు. ప్రతినెల తెలంగాణకు 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని, ఒక లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3370 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులు అన్నిటిని డిజిటలైట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి )
ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్టు కేంద్ర ఆహార పౌరసరఫరాలు, వినియోదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ విపత్తులో ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహారభద్రత కింద పేదలందరికీ ఐదు కిలోలు చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని ఇది 2030 వరకు కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల నివేదికలో భారత దేశంలో అత్యంత ఎక్కువమందికి ఆహారభద్రత కింద ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్టు వెల్లడించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరిస్తున్నామని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం దేశంలో ఉందని, తెలంగాణతో కలిపి 2023 –24 సంవత్సరంలో 2.25 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు ఖాతాలలో జమ చేసిందని తెలిపారు. ప్రతినెల తెలంగాణకు 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని, ఒక లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3370 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చేసేందుకు రేషన్ కార్డులు అన్నిటిని డిజిటలైట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.