కామారెడ్డి, 05 అక్టోబర్ పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ సమైక్య యువజన దుర్గ మండలి ఆధ్వర్యం లో దుర్గామాత శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామ స్తులు తండోపతండాలుగా తరలివచ్చి, రామారెడ్డి ప్రధాన వీధులన్నీ భక్త జన సంద్రోహంతో నిండిపో యాయి.అష్టాదశ శక్తి మాతల ఊరేగింపు శోభా యాత్రలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అష్టాదశ శక్తి మాతల (18 శక్తి స్వరూపాల) విగ్రహా లను అలంకరించి ప్రత్యేక వాహనంలో ఊరేగిం చారు. ఈ రథయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండలి సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు ఈ శోభాయా త్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు శోభాయాత్రలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగిత్యాల జయ కృష్ణ డ్యాన్స్ బృందం వారు ప్రదర్శించిన నృత్యాలు, కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. వారి ప్రదర్శనలను తిలకించేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ శోభాయాత్ర విజయవంతం కావడానికి గాంధీ యువజన సమైక్యం మండలి సభ్యులు ఎంతగానో కృషి చేశారు.


