దుత్తలూరు
Date19-3-2026
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 2న జరగాల్సిన 10వ తరగతి వార్షిక పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ తేదీలో మార్పు రావడంతో విద్యార్థులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుఉన్నట్లు
జిల్లా విద్యాశాఖాధికారులకు తెలియజేయబడినది ఏమనగా, ప్రభుత్వం 21-03-2026 తేదీని రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో, అదే తేదీన నిర్వహించవలసిన ఎస్‌ఎస్‌సి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E) వాయిదా వేయబడినది.
అందువలన, *3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E)ను 02-04-2026 (2nd April 2026 – Thursday) తేదీన ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించబడును.*
జిల్లా విద్యాశాఖాధికారులు తమ తమ జిల్లాలలో ఈ మార్పును విస్తృతంగా ప్రచారం చేయించి, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి సమాచారం చేరేలా నిర్ధారించాలి.
అదనంగా, 02-04-2026న జరగనున్న పరీక్షను సజావుగా నిర్వహించుటకు సంబంధిత జిల్లాలలో పరీక్షా కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం మరియు అవసరమైన ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉంచవలెను.
21-03-2026 తేదీన విధులకు నియమించబడిన ఇన్విజిలేటర్లు యథావిధిగా 02-04-2026 తేదీన కూడా విధులు నిర్వహించవలెను. దీనికి సంబంధి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి

