అమలాపురం, అక్టోబరు 06 (పున్నమి ప్రతినిధి) :
రాష్ట్రంలోనే తొలిసారిగా అమలాపురం నియోజకవర్గం లో బ్రిటిష్ కొలమానాన్ని తెరపైకి తీసుకువచ్చామని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అన్నారు. నడిపుడి నుంచి చల్లపల్లి వరకు తొలి విడత సర్వే రాళ్లను ఈరోజు వేయడం ప్రారంభించారు. శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జె సి నిషాంతి, అర్డీఓ మాధవి ల సమక్షంలో ఈ రాయిలు పాతడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం తాము సర్వే చేసి స్థల నిర్ధారణ చేస్తున్నామని అవసరాలకు అనుగుణంగా ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని శాసనసభ్యులు అన్నారు. కాలువ వెంబడి ఉన్న ఆ క్రమణలు గుర్తించి వాటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. నడిపూడి కొత్త వంతెణ నుంచి నల్ల వంతెన వరకు 20 అడుగుల రోడ్డు వెడల్పు చేస్తామని ఆనందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అశోక ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బ్రిటిష్ కొలతలకు సర్వే రాళ్లు… ఎస్ యానాం వరకు మొదటి విడత సర్వే… ఆక్రమణలు దశలు వారీగా తొలగింపు… ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం, అక్టోబరు 06 (పున్నమి ప్రతినిధి) : రాష్ట్రంలోనే తొలిసారిగా అమలాపురం నియోజకవర్గం లో బ్రిటిష్ కొలమానాన్ని తెరపైకి తీసుకువచ్చామని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అన్నారు. నడిపుడి నుంచి చల్లపల్లి వరకు తొలి విడత సర్వే రాళ్లను ఈరోజు వేయడం ప్రారంభించారు. శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జె సి నిషాంతి, అర్డీఓ మాధవి ల సమక్షంలో ఈ రాయిలు పాతడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం తాము సర్వే చేసి స్థల నిర్ధారణ చేస్తున్నామని అవసరాలకు అనుగుణంగా ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని శాసనసభ్యులు అన్నారు. కాలువ వెంబడి ఉన్న ఆ క్రమణలు గుర్తించి వాటిపై త్వరలో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. నడిపూడి కొత్త వంతెణ నుంచి నల్ల వంతెన వరకు 20 అడుగుల రోడ్డు వెడల్పు చేస్తామని ఆనందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అశోక ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

