శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ మంత్రి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల కోసం భారీ ఉచిత నొప్పి నివారణ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ (బుధవారం) స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని, అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు (Chronic Pains) ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించనున్నారు. శిబిరంలో పాల్గొనే ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి కృష్ణ కలతూర్: పెయిన్ మేనేజ్‌మెంట్ నిపుణులు, అపోలో హాస్పిటల్స్, చెన్నై. డాక్టర్ శ్రీనివాస్ చిరవూరి: ప్రముఖ వైద్య నిపుణులు, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, అమెరికా (USA). ఏప్రిల్ 15, 2026 (బుధవారం) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, శ్రీకాళహస్తి. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, ఇతర శారీరక నొప్పులతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. “నొప్పి లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడమే ఈ శిబిర ప్రధాన ఉద్దేశ్యం” అని నిర్వాహక ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బొజ్జల జయంతి కానుక-15న ఉచిత మెగా వైద్య శిబిరం – ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి