, ఇబ్రహీంపట్నం: అక్టోబర్ 25 పున్నమి
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల గ్రామం వాండర్ల సమీపంలోని ఔటర్ సర్వీస్ రోడ్డు పై హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, నర్సింగ్ రావు గ్రామం, ప్రకాష్ నగర్ కు చెందిన బండారి వినోద్(22) S% సంపత్, ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వినోద్ బైక్ పై తుక్కుగూడ వైపు ప్రయాణిస్తుండగా అదే సమయంలో ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు (TS07UE7933) డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన బైక్ ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడం వలన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బైక్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. యువకుడు మృతి
, ఇబ్రహీంపట్నం: అక్టోబర్ 25 పున్నమి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల గ్రామం వాండర్ల సమీపంలోని ఔటర్ సర్వీస్ రోడ్డు పై హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, నర్సింగ్ రావు గ్రామం, ప్రకాష్ నగర్ కు చెందిన బండారి వినోద్(22) S% సంపత్, ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వినోద్ బైక్ పై తుక్కుగూడ వైపు ప్రయాణిస్తుండగా అదే సమయంలో ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు (TS07UE7933) డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చిన బైక్ ను బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడం వలన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

