బెయిల్ పై విడుదలైన మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ శివ పార్వతి, మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడు కుట్రలకు అన్యాయంగా తప్పుడు కేసులులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి మిధున రెడ్డి బెయిల్ పై విడుదలైన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
మిధున రెడ్డి పై ఆరోపణలు కేవలం నిరాధారమని, ఈ 71 రోజులుగా వైయస్సార్ సిపి కుటుంబ సభ్యులు గా ఆయనకు అండగా నిలబడ్డామని, నిరపరాధి గనుకనే ఆయన ధైర్యంగా దీన్ని ఎదుర్కొన్నారని మేడపాటి షర్మిల అన్నారు.
ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మానుకొని ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టి సాధించాలని హితవు పలికారు.


