బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం గా.. అదే విధంగా అనుకూలంగా దాఖలైన పిటీషన్ల పైన విచారణ జరిగింది._
_బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అవ్వటం.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. స్థానిక సంస్థల షెడ్యూల్ సైతం ఈ రిజర్వేషన్లతోనే నిర్వహించేలా సిద్దం అయినట్లు వివరించిన పిటీషనర్.. రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి అవకాశం లేదని వాదనలు వినిపించారు. దీంతో.. హైకోర్టు ఈ వాదనల తరువాత తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది._
_బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఈ కేసు లో దాఖలైన పిటీషన్ల పై కోర్టు ప్రారంభమైన వెంటనే విచారణకు స్వీకరించినా… వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లపై ప్రస్తుత ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్ రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం..కాసేపటి క్రితం విచారణకు స్వీకరించింది._
_కాగా, బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటీషన్ల పైన ముందుగా వాదనలు జరిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన అంశాన్ని న్యాయ వాదులు కోర్టుకు వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టుకు నివేదించారు._
_షెడ్యూల్ విడుదల అయినా.. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే సుప్రీం ఆదేశాలను పిటీషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయిందా అంటూ కోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం అవసరమా అంటూ కోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు._
_అయితే సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరగలేదని పిటీషన్ తరపు లాయర్ వాదించారు. ట్రిపుల్ టెస్ట్ గురించి ప్రధానంగా తన వాదనల్లో ప్రస్తావించారు. ఈ వాదనల తరువాత హైకోర్టు తదుపరి విచారణ కోసం మధ్నాహ్నం కు వాయిదా వేసింది. దీంతో.. హైకోర్టు తీసుకునే నిర్ణయం మేరకు రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల నిర్వహణ అంశం పైన స్పష్టత రానుంది.


