**
నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన మురగ నరేష్ కు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో రాష్ట్ర సహాయ కోశాధికారిగా పదవి ఇవ్వడం జరిగింది. చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా శిక్షణ పొంది పలు బాధ్యతలు నిర్వహించి అనంతరం విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా చేరి గతంలో ఏబీవీపీ వి.ఆర్. కళాశాల అధ్యక్షులుగాను, నెల్లూరు నగర సహాయ కార్యదర్శి గాను, నగర సెంట్రల్ జోన్ ఇన్చార్జిగాను, నగర కార్యదర్శి గాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగాను, ఎస్.ఎఫ్.డి నెల్లూరు జిల్లా కన్వీనర్ గాను, అనంతరం బిజెపిలో చేరి భారతీయ జనతా యువమోర్చాలో నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి గాను, మూలాపేట మండల బిజెపి అధ్యక్షులు గాను, బీజేవైఎం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర సహాయ కోశాధికారిగా నియమించడం జరిగింది.
ఆయనకు పై బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు కే. సునీల్ రెడ్డి మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్. మాధవ్ రాష్ట్ర బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీ నూకల. మధుకర్ నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి మరియు ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రం నలుమూలల పర్యటించి అన్నివర్గాల విద్యార్థి, యువతను సమీకరించి పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర పార్టీలు ఇచ్చే అన్ని కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలలోకి విశేషంగా తీసుకువెళతానని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, విద్యార్థి, యువతలో దేశభక్తి, జాతీయ భావాలు, నైతిక విలువలతో కూడిన సమాజంలో అన్ని వర్గాలలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించే దిశగా పనిచేస్తానన్నారు.


