ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతి నిధి)
తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకుడు, ఆదివాసీ గౌరవ ప్రతీక గోండు బెబ్బులి కొమరం భీం వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నెనవత్ రవి, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాతోట్ మధు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కొమరం భీం త్యాగస్ఫూర్తి, పోరాట పటిమను స్మరించుకుంటూ ఆయన చూపిన దారిలో నడుస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.


