ఖమ్మం పున్నమి ప్రత్యేక ప్రతి నిధి
ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గం ని ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రకటించారు. కార్యవర్గం లో సత్తుపల్లి నియోజకవర్గం కి చెందిన సత్తుపల్లి, వేంసూరు మండలాలకి చెందిన నాయకులని జిల్లా కార్యవర్గం లోకి తీసుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులు గా
సుదర్శన్ మిశ్ర (సత్తుపల్లి ) వీరం రాజు (వేంసురు) ప్రధాన కార్యదర్శి గా నాయుడు రాఘవ రావు (సత్తుపల్లి) కార్యదర్శి గా సురేంద్ర రెడ్డి (వేంసురు) జిల్లా కమిటీ కి ఎన్నిక ఐయ్యారు. వీరి ఎన్నిక పట్ల సత్తుపల్లి, వేంసురు మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


