Monday, 8 December 2025
  • Home  
  • బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి. దేశంలో విద్య వ్యాప్తికి కృషి చేసిన మహాత్ముడు ఫూలే.
- జోగులాంబ గద్వాల

బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి. దేశంలో విద్య వ్యాప్తికి కృషి చేసిన మహాత్ముడు ఫూలే.

బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి. దేశంలో విద్య వ్యాప్తికి కృషి చేసిన మహాత్ముడు ఫూలే. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు* జోగులాంబ నవంబర్28 పున్నమి ప్రతినిధి ( ఎర్రవల్లి) – దేశంలో విద్య వ్యాప్తి కృషి చేసిన బహుజన యోధుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు ఏర్పాటు చేసిన ఫూలే వర్ధంతి కార్యక్రమంకు ఆయన హాజరైయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మహాత్మా జోతిరావు ఫూలే భారత సామాజిక ఉద్యమాల పితామహుడు అన్నారు.భారతీయ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరంగా పోరాడిన మహానుభావుల్లో మహాత్మా జోతిరావు గోవిందరావు ఫూలే (11 ఏప్రిల్ 1827 – 28 నవంబర్ 1890) ప్రత్యేక స్థానం పొందారు. అణచివేతకు గురైన వర్గాలు, మహిళలు, శూద్ర–అతిశూద్రుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో సామాజిక పునర్‌వ్యవస్థీకరణకు బలమైన పునాది వేశారు.అణగారిన వర్గాల విద్యోద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఫూలే అని అన్నారు. 1848లో జోతిరావు ఫూలే, తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి ఫూలేతో కలిసి పూణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. భారతదేశంలో మహిళలకు విద్యా హక్కుతో కూడిన ప్రాయోగిక ఉద్యమం ఇదే మొదటిసారి.తరువాత శూద్రులు, అతిశూద్రులు, కార్మికుల పిల్లల కోసం పలు పాఠశాలలు, రాత్రి బడులు, వితంతు శరణాలయాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. భారత మహిళా విద్యా చరిత్రలో సావిత్రిబాయి–జోతిరావు ఫూలే దంపతులను అగ్రగాములుగా నిలిపిన ఘనత ఇది.సత్యశోధక్ సమాజ్ – సమానత్వ దిక్సూచి అన్నారు.1873లో ఫూలే ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. జన్మ ఆధారంగా ఉన్న అసమానతలను ప్రశ్నించిందన్నారు. సామాజిక న్యాయ భావజాలాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందన్నారు.కులపరమైన వివాహాల్లో పురోహితాధారిత నియమాలను సవాలు చేసిందన్నారు.1880లో బొంబాయి హైకోర్టు సత్యశోధక్ సమాజ్ పద్ధతిలో జరిగిన వివాహాలు చట్టబద్ధమని తీర్పు ఇవ్వడం ఫూలే ఉద్యమ విజయానికి చిహ్నం అన్నారు.సామాజిక దోపిడీపై ధైర్యవంతమైన ప్రతిఘటన.ఫూలే సమాజంలో వ్యాప్తి చెందిన వర్ణవ్యవస్థ, అస్పృశ్యత, మహిళల అణచివేత వంటి సమస్యలను తన రచనలు, ప్రసంగాల ద్వారా బహిరంగంగా విమర్శించారు. ఆయన రచించిన ‘గులాం గిరి’, ‘శేతి ఆనీ కమటి’ వంటి గ్రంథాలు భారత సామాజిక మేలుకోసం ఇప్పటికీ మార్గదర్శకాలు పేర్కొన్నారు.విద్యేనే మనిషిని స్వతంత్రుడిని చేస్తుంది’’ అనేది ఫూలే మాటల్లోని ముఖ్య సారాంశం అన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ స్వయంగా జోతిరావు ఫూలేను తన గురువులలో ఒకరిగా పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ రచించిన ‘శూద్రులు ఎవరు?’ గ్రంథాన్ని ఫూలేకు అంకితం చేయడం ఈ బంధాన్ని మరింత స్పష్టంగా చూపుతుందన్నారు.ఫూలే ఉద్యమం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆలోచనలకు సామాజిక పునాది వేసిందన్నారు.1888లో బొంబాయిలోని మాండ్వీ ప్రాంతంలో జరిగిన ప్రజాసభలో జోతిరావు ఫూలేకు “మహాత్మా” బిరుదును ప్రజలే ప్రకటించారు. ఇది ఆయన చేసిన సేవలకు సమాజం ఇచ్చిన అత్యున్నత గుర్తింపు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో దేవన్న, బుడ్డన్న, నారాయణ, బీమన్న, మోషన్న, నిశిత్, హుస్సేన్, వడ్డే కృష్ణ ఇతరులు పాల్గొన్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి.
దేశంలో విద్య వ్యాప్తికి కృషి చేసిన మహాత్ముడు ఫూలే.
బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు*

జోగులాంబ నవంబర్28 పున్నమి ప్రతినిధి ( ఎర్రవల్లి) – దేశంలో విద్య వ్యాప్తి కృషి చేసిన బహుజన యోధుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ధర్మవరం రాముడు ఏర్పాటు చేసిన ఫూలే వర్ధంతి కార్యక్రమంకు ఆయన హాజరైయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మహాత్మా జోతిరావు ఫూలే భారత సామాజిక ఉద్యమాల పితామహుడు అన్నారు.భారతీయ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరంగా పోరాడిన మహానుభావుల్లో మహాత్మా జోతిరావు గోవిందరావు ఫూలే (11 ఏప్రిల్ 1827 – 28 నవంబర్ 1890) ప్రత్యేక స్థానం పొందారు. అణచివేతకు గురైన వర్గాలు, మహిళలు, శూద్ర–అతిశూద్రుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో సామాజిక పునర్‌వ్యవస్థీకరణకు బలమైన పునాది వేశారు.అణగారిన వర్గాల విద్యోద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఫూలే అని అన్నారు.
1848లో జోతిరావు ఫూలే, తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి ఫూలేతో కలిసి పూణెలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. భారతదేశంలో మహిళలకు విద్యా హక్కుతో కూడిన ప్రాయోగిక ఉద్యమం ఇదే మొదటిసారి.తరువాత శూద్రులు, అతిశూద్రులు, కార్మికుల పిల్లల కోసం పలు పాఠశాలలు, రాత్రి బడులు, వితంతు శరణాలయాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. భారత మహిళా విద్యా చరిత్రలో సావిత్రిబాయి–జోతిరావు ఫూలే దంపతులను అగ్రగాములుగా నిలిపిన ఘనత ఇది.సత్యశోధక్ సమాజ్ – సమానత్వ దిక్సూచి అన్నారు.1873లో ఫూలే ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. జన్మ ఆధారంగా ఉన్న అసమానతలను ప్రశ్నించిందన్నారు.
సామాజిక న్యాయ భావజాలాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందన్నారు.కులపరమైన వివాహాల్లో పురోహితాధారిత నియమాలను సవాలు చేసిందన్నారు.1880లో బొంబాయి హైకోర్టు సత్యశోధక్ సమాజ్ పద్ధతిలో జరిగిన వివాహాలు చట్టబద్ధమని తీర్పు ఇవ్వడం ఫూలే ఉద్యమ విజయానికి చిహ్నం అన్నారు.సామాజిక దోపిడీపై ధైర్యవంతమైన ప్రతిఘటన.ఫూలే సమాజంలో వ్యాప్తి చెందిన వర్ణవ్యవస్థ, అస్పృశ్యత, మహిళల అణచివేత వంటి సమస్యలను తన రచనలు, ప్రసంగాల ద్వారా బహిరంగంగా విమర్శించారు. ఆయన రచించిన ‘గులాం గిరి’, ‘శేతి ఆనీ కమటి’ వంటి గ్రంథాలు భారత సామాజిక మేలుకోసం ఇప్పటికీ మార్గదర్శకాలు పేర్కొన్నారు.విద్యేనే మనిషిని స్వతంత్రుడిని చేస్తుంది’’ అనేది ఫూలే మాటల్లోని ముఖ్య సారాంశం అన్నారు.
డా. బి.ఆర్. అంబేడ్కర్ స్వయంగా జోతిరావు ఫూలేను తన గురువులలో ఒకరిగా పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ రచించిన ‘శూద్రులు ఎవరు?’ గ్రంథాన్ని ఫూలేకు అంకితం చేయడం ఈ బంధాన్ని మరింత స్పష్టంగా చూపుతుందన్నారు.ఫూలే ఉద్యమం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆలోచనలకు సామాజిక పునాది వేసిందన్నారు.1888లో బొంబాయిలోని మాండ్వీ ప్రాంతంలో జరిగిన ప్రజాసభలో జోతిరావు ఫూలేకు “మహాత్మా” బిరుదును ప్రజలే ప్రకటించారు. ఇది ఆయన చేసిన సేవలకు సమాజం ఇచ్చిన అత్యున్నత గుర్తింపు అని గుర్తు చేశారు. కార్యక్రమంలో దేవన్న, బుడ్డన్న, నారాయణ, బీమన్న, మోషన్న, నిశిత్, హుస్సేన్, వడ్డే కృష్ణ ఇతరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.