Thursday, 5 February 2026
  • Home  
  • బిజెపి మాజీ శాసన సభ్యులు NVSS ప్రభాకర్ ప్రెస్ మీట్
- హైదరాబాద్

బిజెపి మాజీ శాసన సభ్యులు NVSS ప్రభాకర్ ప్రెస్ మీట్

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ఆగష్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మీడియా సమావేశం లో మాట్లాడారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ సేవలను కొనియాడుతూ ప్రస్తావించారు. దీనిపై రాహుల్ గాంధీ గారు రకరకాల విమర్శలు గుప్పించారు. రకరకాల మాటలు కూడా మాట్లాడారు. ఆయన చరిత్ర తెలిసి మాట్లాడాడా? లేక చరిత్ర తెలియక మాట్లాడాడా? లేదా కాంగ్రెస్‌లో తాను కొత్త పంథాను చూపించుకోవడం కోసం మాట్లాడాడా? అన్నది అర్థం కావడం లేదు. స్వయంగా ఆయన తాత జవహర్లాల్ నెహ్రూ చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చేసిన సేవలను గమనించి, జవాన్లకు అందించిన సహకారాన్ని గుర్తించారు. ఆ తీరును దృష్టిలో పెట్టుకొని, 1963 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు స్వయంగా భారత ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను పాల్గొనాలని కోరుతూ ఆహ్వానించారు. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. దానికి సంబంధించి దృశ్యాలు మనం చూడొచ్చు అన్నారు చైనా భారత్‌పై ఆక్రమణ చేస్తుందని పలు సార్లు హెచ్చరికలు వచ్చాయి. కానీ ప్రభుత్వం, ప్రసా మాధ్యమాలు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి 1962లో చైనా భారత్ ని ఆక్రమణ చేసింది. అలాగే భారత్–పాకిస్తాన్ యుద్ధాలలో కూడా స్వయంసేవకులు ప్రభుత్వం, సైన్యానికి అన్ని విధాలా సహకారం అందించారు. కొన్ని సంవత్సరాల తర్వాత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడానికి పండిట్ నెహ్రూ స్వయంగా సంఘాన్ని ఆహ్వానించారు. “సంఘంలోని వారు కూడా దేశభక్తులే” అని నెహ్రూ అన్నారు. ఇది రికార్డుల్లో ఉన్న విషయం. పార్లమెంటరీ లేదా డెమోక్రటిక్ వ్యవస్థలో ఎలాంటి రికార్డులు పరిశీలించినా ఇది స్పష్టంగా కనిపించే అంశమే. అని ప్రభాకర్ అన్నారు 1963 జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో స్వయంగా భారత ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించి, పరేడ్‌లో పాల్గొనేలా చూసిన అంశం ఇది అని నేను స్పష్టంగా చెప్పగలన అని ప్రభాకర్అ న్నారు లోకసభ రికార్డుల్లో అప్పటి భారత ప్రధానమంత్రి, ప్రజాప్రియ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మాట్లాడిన అంశం గుర్తుచేసుకోవాలి. భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఢిల్లీలో పరిస్థితులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన వారికీ అవసరం ఏర్పడింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సేవా దళం ట్రాఫిక్ నియంత్రణలో, ఇతర అత్యవసర సహాయ చర్యల్లో పాలుపంచుకుంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో జరిగిన ఒక మహాసమ్మేళనంలో కూడా దీనిపై ప్రస్తావన జరిగింది. రెండో స్వాతంత్ర్య సమరమనేలా సాగిన ఆ ఉద్యమంలో దేవెగౌడ హాజరై ప్రసంగించిన సందర్భం కూడా ఉంది. ఇదంతా లోకసభలో ఒక చర్చ సందర్భంగా స్వయంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రస్తావించారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్–పాక్ యుద్ధం జరిగిన సందర్భంలో, ఆర్ఎస్ఎస్ జవాన్లకు అందించిన సహకారంతో పాటు ఢిల్లీలో ట్రాఫిక్‌ను సమన్వయం చేసి నియంత్రించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వాజ్పేయి లోకసభలో చెప్పిన ఈ విషయాలు అసత్యమైతే లేదా అవాస్తవమైతే, ఆ సమయంలో అక్కడి సభ్యులు అభ్యంతరం చెప్పేవారు. కానీ ఎవరు కూడా తప్పు పట్టలేదు, ఎవరు కూడా కాదనలేదు. కాబట్టి ఇది రికార్డులో నిలిచిన అంశం. అయితే…… ఇటీవల ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సేవలను ప్రస్తావించగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్నే అవమానపరిచేలా ఉన్నాయి. రాజకీయంగా విమర్శించవచ్చు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలియక విమర్శించినట్టు అనిపిస్తోంది. రాజకీయంగా ఆర్ఎస్ఎస్‌తో విభేదించిన పార్టీలు చాలానే ఉన్నాయి. సిద్ధాంతపరంగా కూడా విభేదించిన పార్టీలు ఉన్నాయి. కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు, సమైక్యత–సమగ్రతల విషయంలో, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన దేశభక్తి సంస్థగా ఆర్ఎస్ఎస్‌ను మించిన సంస్థ లేదని అందరూ అంగీకరించక తప్పలేదు. ఇదే దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. మరొక విషయం…. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 1940 జనవరి 2న సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగిన ఆర్ఎస్ఎస్ క్యాంపులో స్వయంగా విచ్చేశారు. అక్కడ ఆయన పరిశీలించి ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పుస్తకంలో ఆయన రాసిన అభిప్రాయంలో, ఇది దేశభక్తి ప్రేరేపితమైన సంస్థ అని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సామాజిక సమరసతకు ప్రతీకగా ఆర్ఎస్ఎస్ నిలుస్తుందని చెప్పారు. స్వయంసేవకులను ఏ కులం అని అడిగినా ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత మహాత్మా గాంధీ కూడా 1934లో వార్ధా జిల్లాలో జరిగిన ఆర్ఎస్ఎస్ సమ్మర్ క్యాంపులో పాల్గొని ప్రసంగించారు. అక్కడ ఆయన కూడా ఇదొక దేశభక్తి కలిగిన సంస్థ, సేవాభావానికి మారుపేరు, క్రమశిక్షణకు నిలయం, దేశభక్తే లక్ష్యంగా నడుస్తున్న సంస్థ అని తెలిపారు. అంతేకాక, 1947 సెప్టెంబర్ 16న ఢిల్లీలో స్వీపర్ కాలనీ శాఖలో పాల్గొని ప్రసంగించారు. అలాగే మన దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా నాగ్ పూర్ లో సరసంఘచాలక్ మోహన్ భగవత్ గారిని కలిసిన సందర్భంగలో. ఆర్ఎస్ఎస్ గురించి ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ పరంపరలోని పెద్ద నాయకులే ఇలా ఆర్ఎస్ఎస్ గురించి ప్రశంసలు గుప్పించారు. అయితే రాహుల్ గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదు. చరిత్రపై మరింత అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక అతి పెద్ద ప్రాంతీయ పార్టీయే మిగిలింది. The inefficiency leadership of Rahul Gandhi made Congress Party a major regional party in this country. అది మాత్రమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా, వారసత్వ పార్టీగా, ఓడిపోయే పార్టీగా, కుంభకోణాల పార్టీగా, దోచుకున్న పార్టీగా, దాచుకున్న పార్టీగా మిగిలిపోయింది. ఒక్కో నాయకుడు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు అందరికీ కనబడుతున్నాయి. బెయిల్ మీద తల్లి, కొడుకులు ఉన్నారు. అంటే వీళ్లు ఏ స్థాయికి దిగజారిపోయారో స్పష్టమవుతోంది. ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగడానికి హక్కు ఎక్కడుంది అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. బెయిల్ మీద ఉన్న తల్లి–కొడుకులు ఈ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణలకు లోనవుతూ ఉన్న తల్లి–కొడుకులు దేశాన్ని ఎలా నడిపిస్తారు? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అదే కాక, వీళ్లు ఎవరికోసం మాట్లాడుతున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో మెజారిటీని ప్రాతినిధ్యం వహించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మైనారిటీల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీగా మారిపోయింది. ఆవుదూడ గుర్తుతో ఉన్నప్పుడు దేశంలో స్థిరమైన పాలన నడిచింది. చేతి గుర్తుకు వచ్చిన తర్వాత మైనారిటీ అపీజ్మెంట్‌లో పడి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. దానికి నిదర్శనం, కాంగ్రెస్ ఇప్పుడు మూడు రాష్ట్రాలకు పరిమితమైన అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మిగిలిపోవడం. దివాళాకోరు రాజకీయ విధానాల వల్ల కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ప్రతి ఎన్నికలో, ప్రతి సందర్భంలోనూ ఇది ప్రజలకు కనబడుతోంది. అందువల్ల రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక బెయిల్ మీద ఉన్న తల్లి–కొడుకులకు రాజకీయాలు చేసేటటువంటి అధికారం, అవకాశం లేదు. వాళ్లు.. ఇక ఇంట్లో కూర్చుంటే మంచిదని మేము సలహా ఇస్తున్నాం.

పున్నమి ప్రతినిధి హైదరాబాద్
ఆగష్టు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మీడియా సమావేశం లో మాట్లాడారు.
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ సేవలను కొనియాడుతూ ప్రస్తావించారు. దీనిపై రాహుల్ గాంధీ గారు రకరకాల విమర్శలు గుప్పించారు. రకరకాల మాటలు కూడా మాట్లాడారు.

ఆయన చరిత్ర తెలిసి మాట్లాడాడా? లేక చరిత్ర తెలియక మాట్లాడాడా? లేదా కాంగ్రెస్‌లో తాను కొత్త పంథాను చూపించుకోవడం కోసం మాట్లాడాడా? అన్నది అర్థం కావడం లేదు.

స్వయంగా ఆయన తాత జవహర్లాల్ నెహ్రూ చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చేసిన సేవలను గమనించి, జవాన్లకు అందించిన సహకారాన్ని గుర్తించారు. ఆ తీరును దృష్టిలో పెట్టుకొని, 1963 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు స్వయంగా భారత ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను పాల్గొనాలని కోరుతూ ఆహ్వానించారు.

ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. దానికి సంబంధించి దృశ్యాలు మనం చూడొచ్చు అన్నారు
చైనా భారత్‌పై ఆక్రమణ చేస్తుందని పలు సార్లు హెచ్చరికలు వచ్చాయి. కానీ ప్రభుత్వం, ప్రసా మాధ్యమాలు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి 1962లో చైనా భారత్ ని ఆక్రమణ చేసింది.
అలాగే భారత్–పాకిస్తాన్ యుద్ధాలలో కూడా స్వయంసేవకులు ప్రభుత్వం, సైన్యానికి అన్ని విధాలా సహకారం అందించారు.

కొన్ని సంవత్సరాల తర్వాత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడానికి పండిట్ నెహ్రూ స్వయంగా సంఘాన్ని ఆహ్వానించారు. “సంఘంలోని వారు కూడా దేశభక్తులే” అని నెహ్రూ అన్నారు. ఇది రికార్డుల్లో ఉన్న విషయం.

పార్లమెంటరీ లేదా డెమోక్రటిక్ వ్యవస్థలో ఎలాంటి రికార్డులు పరిశీలించినా ఇది స్పష్టంగా కనిపించే అంశమే. అని ప్రభాకర్ అన్నారు
1963 జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో స్వయంగా భారత ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించి, పరేడ్‌లో పాల్గొనేలా చూసిన అంశం ఇది అని నేను స్పష్టంగా చెప్పగలన అని ప్రభాకర్అ న్నారు

లోకసభ రికార్డుల్లో అప్పటి భారత ప్రధానమంత్రి, ప్రజాప్రియ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మాట్లాడిన అంశం గుర్తుచేసుకోవాలి.

భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఢిల్లీలో పరిస్థితులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన వారికీ అవసరం ఏర్పడింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సేవా దళం ట్రాఫిక్ నియంత్రణలో, ఇతర అత్యవసర సహాయ చర్యల్లో పాలుపంచుకుంది.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో జరిగిన ఒక మహాసమ్మేళనంలో కూడా దీనిపై ప్రస్తావన జరిగింది. రెండో స్వాతంత్ర్య సమరమనేలా సాగిన ఆ ఉద్యమంలో దేవెగౌడ హాజరై ప్రసంగించిన సందర్భం కూడా ఉంది.

ఇదంతా లోకసభలో ఒక చర్చ సందర్భంగా స్వయంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రస్తావించారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్–పాక్ యుద్ధం జరిగిన సందర్భంలో, ఆర్ఎస్ఎస్ జవాన్లకు అందించిన సహకారంతో పాటు ఢిల్లీలో ట్రాఫిక్‌ను సమన్వయం చేసి నియంత్రించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

వాజ్పేయి లోకసభలో చెప్పిన ఈ విషయాలు అసత్యమైతే లేదా అవాస్తవమైతే, ఆ సమయంలో అక్కడి సభ్యులు అభ్యంతరం చెప్పేవారు. కానీ ఎవరు కూడా తప్పు పట్టలేదు, ఎవరు కూడా కాదనలేదు. కాబట్టి ఇది రికార్డులో నిలిచిన అంశం.

అయితే…… ఇటీవల ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సేవలను ప్రస్తావించగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్నే అవమానపరిచేలా ఉన్నాయి.

రాజకీయంగా విమర్శించవచ్చు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలియక విమర్శించినట్టు అనిపిస్తోంది. రాజకీయంగా ఆర్ఎస్ఎస్‌తో విభేదించిన పార్టీలు చాలానే ఉన్నాయి. సిద్ధాంతపరంగా కూడా విభేదించిన పార్టీలు ఉన్నాయి. కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు, సమైక్యత–సమగ్రతల విషయంలో, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన దేశభక్తి సంస్థగా ఆర్ఎస్ఎస్‌ను మించిన సంస్థ లేదని అందరూ అంగీకరించక తప్పలేదు. ఇదే దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ.

మరొక విషయం…. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 1940 జనవరి 2న సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగిన ఆర్ఎస్ఎస్ క్యాంపులో స్వయంగా విచ్చేశారు. అక్కడ ఆయన పరిశీలించి ప్రసంగించారు.

ఆ సమయంలో అక్కడ ఉన్న పుస్తకంలో ఆయన రాసిన అభిప్రాయంలో, ఇది దేశభక్తి ప్రేరేపితమైన సంస్థ అని స్పష్టంగా పేర్కొన్నారు.

అలాగే సామాజిక సమరసతకు ప్రతీకగా ఆర్ఎస్ఎస్ నిలుస్తుందని చెప్పారు. స్వయంసేవకులను ఏ కులం అని అడిగినా ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

తర్వాత మహాత్మా గాంధీ కూడా 1934లో వార్ధా జిల్లాలో జరిగిన ఆర్ఎస్ఎస్ సమ్మర్ క్యాంపులో పాల్గొని ప్రసంగించారు. అక్కడ ఆయన కూడా ఇదొక దేశభక్తి కలిగిన సంస్థ, సేవాభావానికి మారుపేరు, క్రమశిక్షణకు నిలయం, దేశభక్తే లక్ష్యంగా నడుస్తున్న సంస్థ అని తెలిపారు. అంతేకాక, 1947 సెప్టెంబర్ 16న ఢిల్లీలో స్వీపర్ కాలనీ శాఖలో పాల్గొని ప్రసంగించారు.

అలాగే మన దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా నాగ్ పూర్ లో సరసంఘచాలక్ మోహన్ భగవత్ గారిని కలిసిన సందర్భంగలో. ఆర్ఎస్ఎస్ గురించి ప్రశంసలు కురిపించారు.

కాంగ్రెస్ పార్టీ పరంపరలోని పెద్ద నాయకులే ఇలా ఆర్ఎస్ఎస్ గురించి ప్రశంసలు గుప్పించారు.

అయితే రాహుల్ గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదు. చరిత్రపై మరింత అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక అతి పెద్ద ప్రాంతీయ పార్టీయే మిగిలింది.

The inefficiency leadership of Rahul Gandhi made Congress Party a major regional party in this country.

అది మాత్రమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా, వారసత్వ పార్టీగా, ఓడిపోయే పార్టీగా, కుంభకోణాల పార్టీగా, దోచుకున్న పార్టీగా, దాచుకున్న పార్టీగా మిగిలిపోయింది.

ఒక్కో నాయకుడు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు అందరికీ కనబడుతున్నాయి. బెయిల్ మీద తల్లి, కొడుకులు ఉన్నారు. అంటే వీళ్లు ఏ స్థాయికి దిగజారిపోయారో స్పష్టమవుతోంది. ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగడానికి హక్కు ఎక్కడుంది అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది.

బెయిల్ మీద ఉన్న తల్లి–కొడుకులు ఈ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణలకు లోనవుతూ ఉన్న తల్లి–కొడుకులు దేశాన్ని ఎలా నడిపిస్తారు? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.

అదే కాక, వీళ్లు ఎవరికోసం మాట్లాడుతున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో మెజారిటీని ప్రాతినిధ్యం వహించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మైనారిటీల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీగా మారిపోయింది.

ఆవుదూడ గుర్తుతో ఉన్నప్పుడు దేశంలో స్థిరమైన పాలన నడిచింది. చేతి గుర్తుకు వచ్చిన తర్వాత మైనారిటీ అపీజ్మెంట్‌లో పడి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. దానికి నిదర్శనం, కాంగ్రెస్ ఇప్పుడు మూడు రాష్ట్రాలకు పరిమితమైన అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మిగిలిపోవడం.

దివాళాకోరు రాజకీయ విధానాల వల్ల కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ప్రతి ఎన్నికలో, ప్రతి సందర్భంలోనూ ఇది ప్రజలకు కనబడుతోంది.

అందువల్ల రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఇక బెయిల్ మీద ఉన్న తల్లి–కొడుకులకు రాజకీయాలు చేసేటటువంటి అధికారం, అవకాశం లేదు. వాళ్లు.. ఇక ఇంట్లో కూర్చుంటే మంచిదని మేము సలహా ఇస్తున్నాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.