తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
బిక్కవోలు, నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి) :
బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో “షష్ఠి” మహోత్సవం సందర్బంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, తెలుగు మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


