Sunday, 15 March 2026
  • Home  
  • * బాలాపూర్ గ్రామంలో అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లకు మూతలు ఎక్కడ –ప్రజల త్రాగు నీరు పై జిహెచ్ఎంసి ఇంత నిర్లక్ష్యమా – రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి *
- రంగారెడ్డి

* బాలాపూర్ గ్రామంలో అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లకు మూతలు ఎక్కడ –ప్రజల త్రాగు నీరు పై జిహెచ్ఎంసి ఇంత నిర్లక్ష్యమా – రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ బడంగ్పేట్ సర్కిల్ 62వ బాలాపూర్ డివిజన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో ఉన్న అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ సంపులకు సరైన మూతలు లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మూతలు లేకపోవడంతో వాటర్ ట్యాంక్‌లలో చెత్త చెదారం పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పలు జీవరాసులు కూడా ట్యాంక్‌లలో పడే ప్రమాదం ఉండటంతో ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితమై ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత కీలకమైన తాగునీటి విషయంలో కూడా జిహెచ్ఎంసి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. కాబట్టి వెంటనే స్పందించి బాలాపూర్ గ్రామంలోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లకు బలమైన సురక్షితమైన మూతలు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే విధంగా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి వెనుకాడబోమని రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మురళీధర్ రెడ్డి సైదులు సతీష్ నంద నాగరాజు పవన్ తదితరులు పాల్గొన్నారు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ బడంగ్పేట్ సర్కిల్ 62వ బాలాపూర్ డివిజన్ పరిధిలోని బాలాపూర్ గ్రామంలో ఉన్న అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ సంపులకు సరైన మూతలు లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని బడంగ్పేట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మూతలు లేకపోవడంతో వాటర్ ట్యాంక్‌లలో చెత్త చెదారం పడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పలు జీవరాసులు కూడా ట్యాంక్‌లలో పడే ప్రమాదం ఉండటంతో ప్రజలకు సరఫరా చేసే తాగునీరు కలుషితమై ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అత్యంత కీలకమైన తాగునీటి విషయంలో కూడా జిహెచ్ఎంసి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.
కాబట్టి వెంటనే స్పందించి బాలాపూర్ గ్రామంలోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లకు బలమైన సురక్షితమైన మూతలు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను డిమాండ్ చేశారు.ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే విధంగా అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి వెనుకాడబోమని రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మురళీధర్ రెడ్డి సైదులు సతీష్ నంద నాగరాజు పవన్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.