కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు రాజమహేంద్రవరంలో ఆదివారం వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాట ఘటనకు కారణమని నిరసన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరం అన్నారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన మూడవ తొక్కిసలాట ఘటన అని అన్నారు.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలన్నారు.

బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు -రాజమహేంద్రవరంలో వైయస్సార్సీపి కొవ్వొత్తుల ర్యాలీ -తొక్కిసిలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుంది
కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు రాజమహేంద్రవరంలో ఆదివారం వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాట ఘటనకు కారణమని నిరసన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరం అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన మూడవ తొక్కిసలాట ఘటన అని అన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలన్నారు.

