తాళ్లపూడి,( తూర్పుగోదావరి,పున్నమి ప్రతినిధి) ఏప్రిల్ 2 :
లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న తాళ్లపూడి వాసి ఇర్లపాటి గంగారత్నంకు మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవడమే మానవత సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య మరియు వైద్య రంగాల్లో సేవలందించేందుకు సంస్థ అధికంగా ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.
గెడ్డం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని అన్నారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, దుగ్గిరాల సూర్యనారాయణ, గెడ్డం సాయిబాబా, చెరుకు ఆంజనేయులు, కొప్పాక వెంకటేశ్వరరావు, కోదాటి సత్యనారాయణ, ఇర్లపాటి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

బాధలో ఉన్నవారికి భరోసా – మానవత సేవా సంస్థ ముందుకు
తాళ్లపూడి,( తూర్పుగోదావరి,పున్నమి ప్రతినిధి) ఏప్రిల్ 2 : లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న తాళ్లపూడి వాసి ఇర్లపాటి గంగారత్నంకు మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవడమే మానవత సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య మరియు వైద్య రంగాల్లో సేవలందించేందుకు సంస్థ అధికంగా ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. గెడ్డం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని అన్నారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, దుగ్గిరాల సూర్యనారాయణ, గెడ్డం సాయిబాబా, చెరుకు ఆంజనేయులు, కొప్పాక వెంకటేశ్వరరావు, కోదాటి సత్యనారాయణ, ఇర్లపాటి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

