శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మార్కాపురం జిల్లా, రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే భారీ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, నాయకులు మునికృష్ణయ్య, మహేష్, భరణి, జోసెఫ్, నాగరాజు, భరణి, కృష్ణసాయి తదితరులు పాల్గొని మృతులకు నివాళులర్పించారు.

బస్సు ప్రమాదమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి-దామోదరం రెడ్డి